हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు

Anusha
Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు

వైసీపీ నేత,గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఉదయం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, వంశీ(Vallabhaneni Vamsi)ని రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో  వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు
Vallabhaneni Vamsi: కోర్టు అనుమతితో వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకున్న పోలీసులు

విచారణ

బాపులపాడులో అర్హులైన పేదలకు కాకుండా, నకిలీ పట్టాలు సృష్టించి పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు గతంలోనే పీటీ వారెంట్ దాఖలు చేసి, వంశీని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు.కాగా, వల్లభనేని వంశీ ఇప్పటికే పలు ఇతర కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. తాజా పరిణామంతో నకిలీ పట్టాల కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

Read Also: AirPort: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870