ఇంటి ప్రధాన ద్వారం ఏ ఆయుధం చేతనైన పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసం అయినప్పుడు(కొట్టబడుట/నరకబడుట) ఆ గృహానికి ‘కులిశ వేధ’ దోషం సంక్రమిస్తుంది. ప్రధాన ద్వారంగాక ఏ ఇతర ద్వారంగానీ, గొడ్డలి, గునపం మొదలైన ఆయుధం చేత పూర్తిగాగానీ పాక్షికంగా గానీ ధ్వంసం అయినపునపడు ఇదే దోషం ఆ గృహానికి ప్రాప్తించబడుతుంది. సింహద్వారం ధ్వంసం అయినందువల్ల దోషం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అటువంటి గృహంలో ఉండేవారు కోలుకోలేనటువంటి తీవ్ర నష్టాలు పొందే అవకావముంటుంది. ‘కులిశ్ నహతో ద్వారో గృహాంతస్థే మృతిర్భవేత్’ కులిశ వేధ దోషం వున్న గృహంలో నివసించేవారికి మరణం సంభవిస్తుందని దీని తాత్పర్యం. అందువల్ల ఇటువంటి దోషాలను తీవ్రంగా పరిగణించి వెంటనే దోష పూరిత ద్వారాలను తీసివేసి కొత్త ద్వారాలను వాస్తు నియమానుసారం ప్రతిష్ఠించుకోవటం అన్ని విధాల మంచిది. నష్టం (loss) కలిగే వరకు వేచి చూడకుండా ముందే జాగ్రత్త పడటం తప్పనిసరి. ఆయుధాలు చేత కొట్టబడిన ద్వారాల పైన ఏర్పడిన పగుళ్లను, రంధ్రాలను కనిపించకుండా లప్పం, మైనం మొదలైన వాటితో సరిచేయటం వలన ఉపయోగం ఉండదు. తప్పనిసరిగా కొత్త ద్వారాలను ప్రతిష్ఠించవలసిందే.
ఎవరు పెద్ద? ఎవరు చిన్న?
ప్రశ్న: కవల పిల్లల విషయంలో ఎవరు పెద్ద? ఎవరు చిన్న? అని ఎలా నిర్ధారణ చేయాలి? ఈ విషయం ఎటూ తేల్చుకోలేక కొన్ని సందర్భాలలో (అంటే జాతక, కర్మలు మొ॥) చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనికి ఏమైనా పరిష్కారముందా?
జవాబు: జాతక, కర్మాదుల యందే కాక వివాహ (marriage) వ్యవహారాదుల యందు కూడా జ్యేష్ట, కనిష్ఠ నిర్ణయం చాలా సందర్భాలలో అవసరమవుతుంటుంది. మొదట జన్మించినవారు పెద్దవారని, తదుపరి జన్మించినవారు చిన్నవారని సాధారణంగా చెబుతుంటారు. అన్ని సందర్భాలలో అది సరికాదు.
శ్లో: యమశౌచైక గర్భేతు స్త్రీవా పురుష ఏకవా కనిష్ఠ ఆద్యజాతస్యాత్పశ్చాజ్ఞాతో గ్రజస్స్మృతః
- గర్భంలో ఉన్న: ఇరువురు శిశువులు పైన ఒకరు, కింద ఒకరు ఉన్నట్లయితే మొదట జన్మించినవాడు చిన్నవాడుగాను(కనిష్ఠ) పిదప జన్మించినవాడు పెద్దవాడుగాను (జ్యేష్టుడు) అని నిర్ధారించుకోవాలి.
- ఒకవేళ గర్భంలో ఉన్న ఇరువురు శిశువులు పక్క పక్కనే ఉన్నప్పుడు మొదట జన్మించినవాడు జ్యేష్టుడు, పిదప జన్మించినవాడు కనిష్ఠుడిగా గ్రహించాలి.
- గర్భస్థ శిశువు విధానం తెలియనప్పుడు మొదట జన్మించినవారు చిన్నవాడుగా, పిదప జన్మించినవారు పెద్దవాడుగా గ్రహించటం శిష్టాచారం.

‘కంక వేధ’ అంటే ఏమిటి?
జవాబు: గృహ గర్భానికి నాలుగు వైపులగానీ, రెండు వైపులగానీ వసారాలను సమానంగా ఉంచాలి. అలాగాక బేసి సంఖ్య వసారాలను నిర్మించినా, హెచ్చు-తగ్గులుగా వసారాలను నిర్మించినా “పార్శహీనంతధాకంకః” అనే లక్షణానుసారం ‘కంకవేధ’ దోషం ఏర్పడుతుంది. ఇలాంటి వేధ కలిగే గృహంలో నివసించేవారు, గృహ యజమాని దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది. కనుక ఒక గృహానికి వసారాలను ఏర్పరచుకోవలసి వస్తే తప్పనిసరిగా అందుకు అవసరమైన వాస్తు నియమాలను పాటించాలి. ఒకవేళ ఇటువంటి వేధను కలిగిన ఇంట్లో నివసిస్తూ దారిద్య్ర బాధలను అనుభవించేవారు, వారి బాధలకు కారణం ‘కంక వేధ’ దోషం తెలుసుకొని వసారాలను వాస్తు నియమానుసారం సరిచేసుకున్నట్లయితే తప్పకుండా దారిద్య్ర బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. అనటంలో సందేహం లేదు.
Read also : hindi.vaartha.com
Read also: