nirmala

ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆపాలి: కేంద్రం

ఛాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని వంటి విదేశీ AI యాప్‌ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ పనిని సులభంగా, వేగంగా పూర్తిచేయడానికి ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏఐ యాప్స్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్‌ను తప్పక అనుమతించాల్సిందే. ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే తమ ఉద్యోగులు ఛాట్ జీపీటీ, డీప్ సీక్ ఇక మీదట వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థికశాఖ.

అధికారిక పనుల కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై AI సాధనాలను ఉపయోగించటం మానుకోవాలని ఆపాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించినట్లు పలు జాతీయ మీడియా కథానాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వం సొంత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు చైనాకు చెందిన డీప్ సీక్ వాడకంపై నిషేధాజ్ఞలు జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వాడుతున్న ఏఐ యాప్‌లు డేటా భద్రతకు, గోప్యతకు భంగం కలిగించవచ్చనే భయాందోళనే అందుకు ప్రధాన కారణం.

Related Posts
ఆ గ్రామంలో హై అలర్ట్ …అంతుచిక్కని వ్యాదితో 13 మంది మృతి
High alert in that village...13 people died due to a contagious disease

ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ లో వింత వ్యాధి కలకలం రేపుతోంది.. ఈ అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే 13 మంది మృతి చెందగా 80 మంది బాధితులు Read more

మళ్లీ ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Bomb threats to Delhi schools again

న్యూఢిల్లీ: మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం Read more

పరీక్షా పై చర్చ 2025: ప్రధాని మోదీని కలిసే అవకాశం!
పరీక్షా పే చర్చ 2025: ప్రధాని మోదీని కలిసే అవకాశం!

భారతదేశంలో ప్రతి విద్యార్థి ఎదురు చూస్తున్న ఆత్మీయ ముఖాముఖీ గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీతో పరీక్షా పై చర్చా 2025. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా Read more

అమెరికా అక్రమ వలసదారులపై ఈడి దర్యాప్తు
అమెరికాలో ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు?

అమెరికాకు భారతీయుల అక్రమ వలసలపై కొనసాగుతున్న దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించడంతో, అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ అంశం గురువారం భారత పార్లమెంట్‌లో సంచలనం సృష్టించింది. Read more