US rejects 41% of student visa applications

F-1 visa: 41శాతం విద్యార్థి వీసాల దరఖాస్తులను తిరస్కరించిన అమెరికా

F-1 visa: విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని చాలామంది ఆశిస్తుంటారు. అందులోనూ అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అందుకే వివిధ దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ విద్యార్థి వీసాల (F-1 visas) సంఖ్యకు అమెరికా భారీగా కత్తెర వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) లో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఆమెరికా తిరస్కరించింది.

41శాతం విద్యార్థి వీసాల దరఖాస్తులను

ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు

అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.79 లక్షల (దాదాపు 41 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల (36 శాతం) దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలుపలేదు. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా.. 1.73 లక్షల (23 శాతం) దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

ఎఫ్‌-1 వీసాలు 38 శాతం తగ్గాయి

అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలను అమెరికా దేశాలవారీగా వెల్లడించలేదు. గత ఏడాది డిసెంబర్‌ 9 వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు 38 శాతం తగ్గాయి. కొవిడ్‌ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది.

Related Posts
Google Gemini: ఘిబ్లీ ఇమేజెస్ ఇప్పుడు గూగుల్ జెమినీ తో..ఎలా అంటే?
Google Gemini: ఘిబ్లీ ఇమేజెస్ ఇప్పుడు గూగుల్ జెమినీ తో..ఎలా అంటే?

ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ ప్రత్యేక శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టూడియో ఘిబ్లీ చేసిన 'స్పిరిటెడ్ అవే', 'మై నెయిబర్ Read more

కొత్త పార్టీ పెట్టబోతున్న నహీద్ ఇస్లాం
Nahid Islam new party

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ Read more

కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్
raghuram pawa

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ Read more

ఈరోజు నుండి మూడు రోజుల పాటు “రైతు పండుగ”
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నుండి మూడు రోజుల పాటు ‘రైతు పండుగ’ నిర్వహించనున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *