ఈయూ సమ్మిట్‌కు జెలెన్‌స్కీ హాజరు

ఈయూ సమ్మిట్‌కు జెలెన్‌స్కీ హాజరు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో చర్చలు విఫలమవడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ . రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ నుంచి రక్షణ కల్పిస్తే, అమెరికాతో కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకానికి సిద్ధమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అమెరికా, రష్యాల మధ్య విసుగు చెందిన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు యూరోపియన్ దేశాల మద్దతును ఆశ్రయిస్తున్నారు.

ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో గొడవ

వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీ, ట్రంప్ భేటీ తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ముఖ్యమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే, ఒవల్ ఆఫీసులోనే ఇద్దరూ మీడియా ముందే మాటల యుద్ధానికి దిగారు. ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం విషయంలో జెలెన్‌స్కీ వైఖరి సరికాదని ట్రంప్ మండిపడ్డారు. అంతేకాదు, ఆయనను “స్టుపిడ్ ప్రెసిడెంట్” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనతో ఒప్పందం నిలిచిపోయింది.

ఈయూ సమ్మిట్‌

అమెరికాలో చేదు అనుభవం ఎదురైన తర్వాత జెలెన్‌స్కీ లండన్‌కు వెళ్లి యూరోపియన్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అక్కడ తన వైఖరిని కొంత మెత్తబర్చిన ఆయన, అమెరికా తమకు మిత్రదేశమేనని తెలిపారు. రష్యా ముప్పు నుంచి రక్షణ కల్పిస్తే, అమెరికాతో ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

im 69063938

ట్రంప్‌ జెలెన్‌స్కీ భేటీ

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మ‌ధ్య వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జ‌రిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే వైట్‌హౌస్‌ నుంచి వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. ఓవ‌ల్ ఆఫీసులో ట్రంప్‌, జెలెన్‌స్కీ మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. రూమ్ అంతా నిండిన మీడియా ముందే ఆ ఇద్దరు నేత‌లు మాట‌ల యుద్ధం కొన‌సాగింది. 

ఉక్రెయిన్‌కు యూరోపియన్‌ దేశాలు మద్దతు

ట్రంప్‌తో చర్చలు విఫలమైన తరువాత, రష్యా మరింత దూకుడుగా వ్యవహరించింది. ఉక్రెయిన్‌పై ఒకేసారి 200 డ్రోన్లను ప్రయోగించింది. అయితే యూరోపియన్ దేశాలు, కెనడా ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించడం జెలెన్‌స్కీకి ఊరట కలిగించింది. ఈ మద్దతును రష్యా తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాలు మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయని రష్యా హెచ్చరించింది.

జెలెన్‌స్కీ హీరో

ట్రంప్‌తో గొడవ తరువాత ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీని హీరోగా చూస్తున్నారు. అగ్రరాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి గా కీర్తిస్తున్నారు.ఖనిజాల ఒప్పందమే ప్రధాన అజెండాగా డొనాల్డ్ ట్రంప్‌, జెలెన్‌స్కీ వైట్‌ హౌస్‌లో భేటీ అయ్యారు. చర్చల అనంతరం అధ్యక్ష కార్యాలయం ఓవల్‌ ఆఫీస్‌కు చేరుకున్న ఇరువురు నేతలు..మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘జెలెన్‌స్కీ.. ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే మేం బయటకు వెళ్లిపోతాం’’ అంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్న ట్రంప్‌ దాన్ని నుంచి గట్టెక్కడం అసాధ్యమని హెచ్చరించారు. దానికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలయింది.

Related Posts
నార్త్ క్యారోలినాలో ట్రంప్, కాలిఫోర్నియాలో హారిస్ కీలక విజయాలు
donald trump

2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ పోటీ కొనసాగుతుంది. తాజా ఫలితాల ప్రకారం, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నార్త్ క్యారోలినాలో మొదటి బాటిల్‌గ్రౌండ్ లో విజయం Read more

దోమ‌లు కొట్టండి డబ్బులు పట్టండి
దోమ‌లు కొట్టండి డబ్బులు పట్టండి

ఫిలిప్పైన్స్‌లో ప్రస్తుతం దోమల బెడద తీవ్రమై, ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని మనీలా సమీపంలోని అడిషన్ హిల్స్ పట్టణంలో ఈ సమస్య Read more

వామ్మో.. మేక ఖరీదు అన్ని లక్షలా..? ఏంటో అంత ప్రత్యేకం
Goat Kid Sold In 14 lakh Ru

ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని Read more

మన్మోహన్‌ సింగ్‌ ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు : జో బైడెన్‌
Joe Biden mourns the death of Manmohan Singh

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ‘నిజమైన రాజనీతిజ్ఞుడు’, ‘గొప్ప ప్రజా Read more