Turmeric Board is not getting any legitimacy or benefits.. Kavitha

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక ప్రయోజనాలు అందడం లేదు: కవిత

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలపై స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. క్వింటాలు పసుపుకు రూ.15వేల ధర కల్పిస్తామని ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ గురించి ప్రశ్నించారు.

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక

కవిత వ్యాఖ్యలు

కనీసం రైతులను పరామర్శించడం లేదు

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తెచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక రైతులకు ప్రయోజనాలు అందడం లేదన్నారు. పసుపునకు మద్దతు ధర పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆమె బండి సంజయ్‌ను నిలదీశారు.

Related Posts
KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR : ఇందిరమ్మ రాజ్యం రైతులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే ఇందిరమ్మ పాలన Read more

ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్
ప్రజా భవన్ లో బిసి నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

తెలంగాణ ప్రభుత్వ బీసీ జన గణనపై స్పష్టత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ప్రతి ఇంటికి ప్రచారం చేయండి ఈ దేశంలో ఇప్పటివరకు బీసీ Read more

Mohana Ranga Rao: వల్లభనేని వంశీ అనుచరుకి ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌
వల్లభనేని వంశీ అనుచరుకి ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌

Mohana Ranga Rao: గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాకు Read more

హామీలెందుకు నెరవేర్చలేకపోతున్నారు – కూనంనేని
kunamneni sambasiva rao

CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల హామీల అమలులో విఫలమవుతున్న కారణాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ముసీ నది పునరుద్ధరణపై Read more