హైదరాబాద్ : 16 రోజుల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక అప్డేట్ వచ్చేసింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో మృతదేహాం ఆనవాళ్లు కనుగొనింది రెస్క్యూ టీం. కుడి చెయ్యి, ఎడమ కాలు భాగాలను గుర్తించారు రెస్క్యూ టీం. చేతికి కడియం ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకి తీసే అవకాశం ఉంది. దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్‌లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు.

టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ
ఇక అటు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తోంది. మిషన్‌ను కట్టర్‌తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్. మిషన్ పార్ట్‌లను బయటకు పంపిస్తున్నారు సహాయకులు. ఈ ప్రక్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్సు ఉంది. టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ కాగా.. 13.950 మీటర్ల వరకు క్లియర్‌గా ఉందన్నారు. జీరో పాయింట్ వద్ద చివరి 50 మీటర్లు సంక్లిష్టంగా ఉందని చెప్పారు. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసేవారికి కూడా ప్రమాదమేనని అన్నారు.
మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ
కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. రెస్క్యూలో భాగంగా రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామన్నారు. ఈనెల 11న ముఖ్యమంత్రి స్థాయిలో మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ ఉంటుందని చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంది. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కాసేపట్లో పూర్తి స్థాయి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.