అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. జూన్ 14న ట్రంప్ 79వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు శ్వేతసౌధం వైద్యులు వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అందుకు సంబంధించిన రిపోర్టును బహిర్గతం చేశారు. అయితే ఈ వైద్య రిపోర్టు ప్రకారం డొనాల్డ్ ట్రంప్ బరువు తగ్గిపోతున్నారు. 2020లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షలతో పోలిస్తే ట్రంప్ ఈసారి 20 పౌండ్ల బరువు తగ్గినట్లు ఫలితాల్లో వెల్లడైంది. అప్పట్లో ట్రంప్ బరువు 244 పౌండ్లు.. కాగా తాజాగా 224 పౌండ్లకు తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

కొంత ఆందోళనకరమైన పరిస్థితిలోనే..
అంతేకాకా ట్రంప్ ఆరోగ్యం నిలకడగా లేదని.. కొంత ఆందోళనకరమైన పరిస్థితిలోనే ఉన్నట్లు సమాచారం. ఆయన చర్మానికి సంబంధించి అనారోగ్యంతో ఉన్నట్లు తేలింది. గతేడాది ఎన్నికల ప్రచారంలో తగిలిన బుల్లెట్ గాయం కారణంగా ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని తెలిసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ట్రంప్ పూర్తి ఫిట్ నెస్ తోనే ఉన్నారని వైద్యుడు, నేవీ కెప్టెన్ సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా విధులు నిర్వహించేందుకు ఆయన పూర్తి ఫిట్‌గా ఉన్నారని తెలిపారు. ట్రంప్ చురుకైన జీవన శైలి వల్లనే ఈ వయసులోనూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారని సీన్ బార్బబెల్లా తెలిపారు.
Read Also: Donald Trump : తాజాగా హెల్త్ చెకప్ చేయించుకున్న ట్రంప్