హార్వర్డ్‌ యూనివర్సిటీకి భారీ కోత విధించిన ట్రంప్

Harvard: హార్వర్డ్‌ యూనివర్సిటీకి భారీ కోత విధించిన ట్రంప్

హార్వర్డ్‌ యూనివర్సిటీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం షాకిచ్చింది. ట్రంప్ సర్కార్​ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించడం వల్ల ఆ​ విశ్వవిద్యాలయానికి అందించే 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను స్తంభించేసింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి సంబంధించిన 60 మిలియన్ డాలర్ల ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేసినట్లు వైట్​హౌస్​ పేర్కొంది.

Advertisements
హార్వర్డ్‌ యూనివర్సిటీకి భారీ కోత విధించిన ట్రంప్

నిధులను స్తంభింపజేసిన ట్రంప్
హార్వార్డ్‌ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్క్​లను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్​ నేతృత్వంలోని పరిపాలన విభాగం శుక్రవారం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన హార్వర్డ్ విశ్వవిద్యాయలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా విశ్వవిద్యాలయాల్లో ఏమి భోదించాలి, ఎవరిని చేర్చుకోవాలి, నియమించుకోవాలి లేదా ఏ రంగాలను ఎంచుకోవాలో నిర్దేశించకూడదని తెలిపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం, హార్వర్డ్‌కు అందే నిధులను స్తంభింపజేయాలని నిర్ణయించింది.
పౌర హక్కులను ఉల్లంఘించారనే ఇప్పటికే కొలంబియా, పెన్సిల్వేనియాతో సహా కార్నెల్‌, నార్త్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను ట్రంప్‌ సర్కార్ నిలిపివేసింది. అయితే, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో యూదు విద్యార్థులకు రక్షణ ఉండాలని, వారికి విద్య, క్యాంపస్‌ వసతులు అవిచ్ఛిన్నంగా అందుబాటులో ఉండాలని ఫెడరల్‌ చట్టం నిర్దేశిస్తోంది. దీన్ని అమలుచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ గత నెలలో విద్యాశాఖ 60 విశ్వవిద్యాలయాలకు లేఖ రాసింది.
ఇతర విశ్వవిద్యాలయాలకు పాకిన నిరసనలు
హమాస్‌పై ఇజ్రాయెల్‌ పోరును నిరసిస్తూ గతేడాది జరిగిన ప్రదర్శనలకు ఎలా అనుమతులు ఇచ్చారని అమెరికన్‌ విశ్వవిద్యాలయాలను ట్రంప్‌ ప్రభుత్వం నిలదీసింది. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ నిరసనలు ఇతర విశ్వవిద్యాలయాల ప్రాంగణాలకూ విస్తరించాయి. పరిశోధన కార్యక్రమాలకు, వైద్య కేంద్రానికీ ఫెడరల్‌ నిధుల సరఫరాను కాపాడుకోవడం కోసం ట్రంప్ ప్రభుత్వ డిమాండ్లకు కొలంబియా విశ్వవిద్యాలయం తలొగ్గింది. ఈ విషయంపై విమర్శలు కూడా వచ్చాయి.

Read Also: Neela Rajendra : నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొల‌గింపు

Related Posts
Gurugram: ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగికదాడి
Gurugram: ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై లైంగికదాడి

గురుగ్రామ్‌లోని ప్రముఖ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై, అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 6న జరిగితే, బాధితురాలు Read more

Hindu Pilgrims : పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కమిటీ తీవ్ర ఖండన
Hindu Pilgrims పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కమిటీ తీవ్ర ఖండన

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తిస్తున్న ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. Read more

మార్చి 24-25న బ్యాంకుల సమ్మె
Bank strike on March 24-25

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. దీంతో ప్రణాళిక ప్రకారం మార్చి 24- Read more

Robert Vadra : రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాబర్ట్ వాద్రా
Robert Vadra రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాబర్ట్ వాద్రా

దేశ రాజ‌కీయాల్లో మరో కీల‌క పరిణామం చోటు చేసుకునేలా ఉంది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన రాబర్ట్ వాద్రా, త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతానని అధికారికంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×