అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను

Trump: విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం.. ట్రంప్‌ వెల్లడి

Trump: విదేశాల్లో తయారై యూఎస్‌లో దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టంచేశారు. బుధవారం వైట్‌హౌస్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో తయారుచేయని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ చర్య శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఈ చర్య మా ఆర్థికవృద్ధిని పెంచుతోంది. మునుపెన్నడూ చూడని వృద్ధిని కొనసాగిస్తుంది. ఏప్రిల్‌ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి అని ట్రంప్‌ పేర్కొన్నారు. మొదట చైనా దిగుమతులపై ట్రంప్‌ 10 శాతం సుంకం విధించగా తర్వాత దాన్ని 20 శాతానికి పెంచారు. ఈ టారిఫ్‌ల విషయంలో ఆ దేశానికి ట్రంప్‌ ఓ ఆఫర్‌ను ప్రకటించారు.

Advertisements
విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం

అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతా

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ ను విక్రయిస్తే.. టారిఫ్‌లు తగ్గించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతానన్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్‌ నిబంధనలకు కట్టుబడనందున జనవరి 18న ఆ యాప్‌ను ప్లే స్టోర్ల నుంచి గూగుల్ , యాపిల్‌ తొలగించాయి. దీని నిషేధాన్ని అమలుచేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలస్యం చేయడంతో అమెరికాలోని ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్‌లలో టిక్‌టాక్‌ మళ్లీ ప్రత్యక్షమయ్యింది. ఈ యాప్‌కు అమెరికాలో 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్‌ కొనుగోలు గురించి ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. తొలుత ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆయన దాన్ని ఖండించారు. ‘సావరిన్‌ వెల్త్‌ఫండ్‌’ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్‌ ఇటీవల ఆదేశిస్తూ.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.

Related Posts
జనసేనలో చేరిన గంజి చిరంజీవి
ganji janasena

ఏపీలో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయంతో, పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలామంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలకమైన నేతలు Read more

టిమ్‌కుక్‌ వేతనం భారీగా పెంపు..
apple ceo tim cook salary gets18 raise he is now earning

న్యూయార్క్‌: యాపిల్ సీఈవో టిమ్‌ కుక్ వేత‌నాన్ని 18 శాతం కంపెనీ పెంచింది. 2023లో $63.2 మిలియన్ (రూ. 544 కోట్లు) నుండి 2024లో కుక్ మొత్తం Read more

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం – రేఖా గుప్తా కీలక నిర్ణయాలు
ప్రమాణ స్వీకార అనంతరం రేఖా గుప్తా తన మొదటి ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రకటించారు.

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం – పాలన ఎలా ఉండబోతోంది? ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా Read more

అంతర్గత తగాదాలతో నష్టం: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక
అంతర్గత తగాదాలతో నష్టం: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక

బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ దేశ భద్రతపై తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. అంతర్గత తగాదాలు, రాజకీయ అస్థిరత దేశ స్వాతంత్ర్యం, సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *