Tricolour Burfi: కావలసినవి
- వేపుడు సెనగలు – రెండు కప్పులు
- పంచదార – ఒక కప్పు
- బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు – పది చొప్పున
- యాలకుల పొడి – చిటికెడు
- నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు
- మీగడ – పావు కప్పు
- చిక్కటి పాలు – అర కప్పు
- ఆరెంజ్ ఫుడ్ కలర్ – టీ స్పూన్
- గ్రీన్ ఫుడ్ కలర్ – టీ స్పూన్

తయారీ విధానం
వేపుడు సెనగలను పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పంచదార (Sugar), బాదం, జీడిపప్పు పలుకులను మిక్సీ జార్ లో పొడి చేసుకోవాలి. తర్వాత సెనగలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ రెంండిటిని వెడల్పాటి గిన్నెలో వేసి, నెయ్యి (ghee), మీగడ జతచేసి బాగా కలపాలి. మీగడ బదులు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా పాలు పోస్తూ పిండిని ముద్దలా చేయాలి. దీన్ని మూడు భాగాలు చేసుకోవలి. ఒకదాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్, మరో దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ప్లేటుకు నెయ్యిరాసి జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు వేసుకోవాలి. ముందుగా ఆరెంజ్ రంగులో ఉన్న ముందు వేసి ప్లేటునిండా పరచాలి. తర్వాత తెల్లని ముద్దను, చివరగా పచ్చ రంగు ఉన్న ముద్దను వేసి సమానంగా పరచాలి. గంటపాటు కదపకుండా పక్కన పెట్టేయాలి. తర్వాత చాకుతో నలుచదరంగా ముక్కలు చేసుకోవాలి. రంగుల ముచ్చటైన బర్ఫీ రెడీ.

Read also:hindi.vaartha.com