Donald Trump Tariff Warning: ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

Read Time:  1 min
మొజ్తాబా ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ
మొజ్తాబా ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ
FONT SIZE
GET APP

Donald Trump: అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక కీలక తీర్పు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తీర్పును సాకుగా చూపుతూ కొన్ని దేశాలు అమెరికాతో ఉన్న సంబంధాలను, ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ దేశమైనా “గేమ్స్” ఆడితే ఊరుకునేది లేదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని అమెరికాను బ్లాక్‌మెయిల్ చేయాలని చూడవద్దని ఆయన సూచించారు.ముఖ్యంగా అమెరికా ను దశాబ్దాలుగా టారిఫ్స్‌తో పీడించిన దేశాలకు గతంలో కంటే ఎక్కువ టారిఫ్స్ విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు.

Read also: Iran: ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

Trump's warning to the world
Trump’s warning to the world

సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని, ఇష్టానుసారం వ్యవహరించాలని చూస్తే ఇటీవల అంగీకరించిన సుంకాల కంటే భారీగా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ హెచ్చరిక జారీ చేశారు.అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ తన మాట వినని వివిధ దేశాలపై అధిక పన్ను విధించారు. ట్రంప్ అధిక సుంకాలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు. టారిఫ్ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లగా, ట్రంప్ తీరును తప్పుబట్టింది. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.