సాధారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఇంటర్ పూర్తి చేసి, ఆ తర్వాత డిగ్రీ చదువుతారు. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసి ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సుల్లో చేరితే, వారు ఆ సమయంలో లభించిన నైపుణ్యాల ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందడానికి అవకాశం కలుగుతుంది. అయితే నేరుగా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదివిన విద్యార్థులలో నైపుణ్యాలు కొంత తక్కువగా ఉంటాయి. అందుకే, నైపుణ్యాలతో తయారైన విద్యార్థులకు (students) ప్రస్తుతంలో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న డిగ్రీలో నైపుణ్యాలు పెంచే దిశగా విద్యాశాఖ రంగంలోకి దిగింది. (TG) ప్రాథమికంగా చర్చించాక రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. డిగ్రీ మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్‌లో ఈ అవకాశం కల్పించాలని భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం(2026-27)లో ఇంటర్న్‌షిప్ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఇంటర్న్‌షిప్ అనేది ప్రస్తుత సమయంలో తప్పనిసరి. అంటే విద్యార్థులు వివిధ పరిశ్రమలు, కార్యాలయాలు, దుకాణాల్లో కొన్నాళ్ల పాటు ఉద్యోగంలా పనిచేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది పని అనేకంటే కూడా శిక్షణ అనడం సముచితంగా ఉంటుంది. అయితే ఉచితంగా ఇంటర్న్‌షిప్ చేయాలంటే ఎవరైనా అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అందులోనూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న వారిలో అధికశాతం మంది పేద, దిగువ మధ్యతరగతి వారుంటున్నారన్నది నిజం. అందుకే ప్రభుత్వం వారికి ఇంటర్న్‌షిప్ కాలానికి నెలకు కొంత స్టైపెండ్ చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Read Also: Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

వెనకడుగులు వేస్తున్న యూనివర్సిటీలు
రాష్ట్ర ఉన్నత విద్యామండలి బీటెక్ సిలబస్‌ను ఆధునీకరించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. వారు రెండో ఏడాది రెండో సెమిస్టర్, మూడో ఏడాది రెండో సెమిస్టర్ ముగిసిన తర్వాత ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరి చేయాలని సిఫారసు చేశారు. (TG) అయితే వర్సిటీలు సిబ్బంది వేతనాలు, అభివృద్ధి నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, ఇంటర్న్‌షిప్ అమలు వాయిదా పడుతోంది. ఈ పరిస్థితుల్లో డిగ్రీ విద్యార్థులకు స్టైపెండ్ ఎలా చెల్లించగలమని వైస్ ఛాన్స్‌లర్లు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటర్న్‌షిప్ అనేది ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తున్నది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్‌షిప్ అమలు చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. మరీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది తేలాల్సిన అంశం.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: