India: హార్ముజ్‌ జలసంధి మూసివేత..ముంచుకొస్తున్న చమురు ముప్పు

Read Time:  1 min
హార్ముజ్‌ జలసంధి మూసివేత..ముంచుకొస్తున్న చమురు ముప్పు.. ఎంతలా అంటే..
హార్ముజ్‌ జలసంధి మూసివేత..ముంచుకొస్తున్న చమురు ముప్పు.. ఎంతలా అంటే..
FONT SIZE
GET APP

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణంతో పరిస్థితులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో.. ఈ ప్రాంతం పూర్తిగా ఉద్రిక్తకరంగా మారింది. గతంలో వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా బందీగా తీసుకెళ్లిన ఘటన పెద్ద స్థాయిలో సంక్షోభంగా మారకపోయినా.. ఇరాన్‌ విషయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC), అలాగే ఇరాన్‌ ప్రజల స్పందన చాలా కఠినంగా ఉండే అవకాశం ఉందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) హెచ్చరిస్తోంది.

Read Also: Indians in Karachi: కరాచీ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న 8 మంది భారతీయులు

Closure of the Strait of Hormuz...a looming threat to oil
Closure of the Strait of Hormuz…a looming threat to oil

హార్ముజ్‌ జలసంధిపై అందరి దృష్టి

ఈ పరిణామాల ప్రభావం నేరుగా ప్రపంచ చమురు మార్కెట్లపై పడే అవకాశముంది. ప్రత్యేకంగా చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ (Hormuz)జలసంధిపై అందరి దృష్టి పడింది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం జరుగుతుంది. భారత్‌కు అవసరమైన చమురులో 35 నుంచి 50 శాతం వరకు ఇదే మార్గం ద్వారా వస్తోంది. ఈ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేస్తే.. ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ జలసంధిని ఇరాన్ మూసివేస్తూ వస్తోంది. 33 కిలోమీటర్ల పొడవైన హార్ముజ్‌ జలసంధి మూసివేత జరిగితే చమురు నౌకలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధరలు 70 నుంచి 73 డాలర్ల పరిధిలో ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు పెరిగితే అవి 90 నుంచి 100 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం

భారత్‌ తన చమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారీగా పెరిగి, కరెంట్‌ అకౌంట్‌ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గే ప్రమాదం కూడా ఉంది. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ చమురు దిగుమతులపై భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. ఈ దిగుమతుల్లో సగానికి పైగా సరఫరా పశ్చిమాసియా నుంచే రావడం మరో కీలక అంశం. ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ వంటి దేశాలు భారత్‌కు ప్రధాన సరఫరాదారులు. ఈ ప్రాంతంలో అస్థిరత పెరిగితే, సరఫరా ఆలస్యం, భీమా ఖర్చుల పెరుగుదల, రవాణా వ్యయాల భారమూ భారత్‌పై పడే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.