Satya Kumar Yadav: ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణ

Read Time:  1 min
Give wide publicity to the tourism sector
Give wide publicity to the tourism sector
FONT SIZE
GET APP

అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చిన మంత్రి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రశ్నోత్తరాలతో సభకార్యకలాపాలను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు .ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభానికి ముందు అసెంబ్లీలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆడియో వ్యవస్థను బాగు చేసేందుకు సాంకేతిక నిపుణులు ముంబై నుంచి వస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల సామర్థం పెంపుపై పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జవాబు ఇచ్చారు. ఆళ్ల గడ్డ, వాయల్పాడు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వురు, నెల్లూరు జిల్లా కోవూరులలో 50 పడకల 100 పడకల ఆసుపత్రిలను ఆసుపత్రిగా మార్చాలంటూ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ విజప్తి చేశారు.

Read also: Palnadu Earthquake Alert: పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

Give wide publicity to the tourism sector

Government is taking full action on the development of hospitals

ఆళ్లగడ్డలో 50 పడకలు ఆసుపత్రిని కూటమి ఏర్పాటు చేసిందని.. దీనిని 100 వడకల ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మాజీ ఎమ్మెల్యే, తన తల్లి శోభానాగిరెడ్డి యాక్సిడెంట్ జరిగిన తర్వాత.. ఆళ్లగడ్డ అనంతరం నంద్యాల.. అక్కడి నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేసినప్పడు గోల్డెన్ అవర్ కోల్పోవడం వల్లే ఆమె చనిపోయారని ఈ సందర్భంగా అఖిల ప్రియ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విషయంలోనూ అలాగే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రమాదాల కారణంగా తమ ప్రాంతంలో చాలా చనిపోతున్నారన్నారు. ఆళ్లగడ్డలో వైద్యులు లేరన్నారు. ఎక్స్పర్ట్లు కూడా లేరని చెప్పారు. అందువల్ల నంద్యాల, కర్నూలుకు రిఫరల్ చేసిన కేసులు వేలలో ఉన్నాయని ఆమె వివరించారు. అళ్లగడ్డలో కనీసం ట్రామా సెంటర్ సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అఖిల ప్రియ కోరారు. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రులో 50 నుంచి 100 పడకల సామర్థ్యానికి పెంచాలంటూ తమకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయితే ట్రామా సెంటర్లు విషయంలో ప్రతి 100 కిలోమీటర్లుకు ఒకటి ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రం ప్రకటన చేసిందని వివరించారు. ఇంతలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.