Strait of Hormuz: చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

Read Time:  1 min
Strait of Hormuz: చమురు ట్యాంకర్ల నిలిపివేత..
Strait of Hormuz: చమురు ట్యాంకర్ల నిలిపివేత..
FONT SIZE
GET APP

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ తన సైనిక విన్యాసాల కోసం ఈ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమాలపై ఒత్తిడి పెంచుతూ సైనిక దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ తన సైనిక పటిమను ప్రదర్శిస్తోంది.

Read Also: GDS Recruitment: ఇండియా పోస్టల్ GDS అప్లికేషన్ కరెక్షన్ విండో ప్రారంభం

Strait of Hormuz: చమురు ట్యాంకర్ల నిలిపివేత..
Strait of Hormuz: చమురు ట్యాంకర్ల నిలిపివేత..

భద్రతా కారణాల దృష్ట్యా..

భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని గంటల పాటు నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. Also Read అదను చూసి అమెరికాను బంగారంతో దెబ్బ కొట్టిన చైనా.. డాలర్ ఢమాల్.. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచానికి హార్ముజ్ జలసంధి ఎందుకు ముఖ్యం? పర్షియన్ గల్ఫ్ , గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లను కలిపే ఈ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, యూఏఈ వంటి దేశాల నుంచి వచ్చే సూపర్ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారానే ఆసియా మార్కెట్లకు చేరుకుంటాయి. ముఖ్యంగా చైనాకు ఇది ప్రధాన సరఫరా మార్గం. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే, చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో 1980 లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి.

భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఇప్పటికే అమెరికా తన అతిపెద్ద యుద్ధ నౌకలైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ , యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్‌లను మధ్యప్రాచ్యానికి తరలించింది. దీనిపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. “ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యానికైనా కోలుకోలేని దెబ్బ తగులుతుంది” అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. యుద్ధ నౌకల కంటే వాటిని సముద్ర గర్భంలోకి తొక్కేసే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని ఆయన పేర్కొనడం ఉద్రిక్తతలను పెంచింది. భవిష్యత్తు పరిణామాలు ప్రస్తుతానికి ఈ మూసివేత తాత్కాలికమే అయినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైతే పరిస్థితి యుద్ధానికి దారితీయవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.