Nara Bhuvaneswari: ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం

Read Time:  1 min
Nara Bhuvaneswari: ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం
FONT SIZE
GET APP
Nara Bhuvaneswari: Heritage aims to empower every dairy farmer

Nara Bhuvaneswari: హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తమ సంస్థ నాణ్యతా ప్రమాణాలపై వినియోగదారులకు భరోసా ఇస్తూ ‘హెరిటేజ్ ప్రామిస్’ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.మూడు దశాబ్దాలుగా తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నామని చెప్పారు.

Read Also: Children missing Vijayawada: విజయవాడలో ఇద్దరు పిల్లల అదృశ్యం

వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలి

నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభమైన సంస్థ వేల కోట్ల స్థాయికి ఎదిగినా నాణ్యతలో రాజీ లేదన్నారు. ప్రతి ఉత్పత్తికి ఇరవై ఐదు పరీక్షలు నిర్వహించిన తర్వాతే వినియోగదారులకు చేరుస్తామని వెల్లడించారు. తొమ్మిది రాష్ట్రాల్లోని సుమారు 3 లక్షల మంది పాడి రైతులతో తమ సంస్థ కలిసి పనిచేస్తోందని భువనేశ్వరి వివరించారు. పారదర్శకత, న్యాయమైన ధర, సకాలంలో చెల్లింపులు అనే సూత్రాలతో రైతులకు సాధికారత కల్పిస్తున్నామని అన్నారు. ఈ వీడియోను పూర్తిగా చూసి, వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.