Indian Diplomacy : నైపుణ్యత మెరుగుపడిన భారత్ దౌత్యనీతి

Read Time:  1 min
Indian Diplomacy
Indian Diplomacy
FONT SIZE
GET APP

డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ సమస్య ఇంకా సర్దుబాటు కాలేదు. కార ణం అక్కడి సుప్రీంకోర్టు మెజార్టీ ఓటుతో ట్రంప్ హెచ్చు సుంకాల విధింపును రద్దు చేసింది. ప్రభుత్వా ధికారులు విభజనకు లోనవుతే ముఖ్యమైన మూడు లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అధికార యంత్రాంగం ఎవరి పని వారు చేయక తప్పదు. అందుకే ట్రంప్ సుంకాల పెంపును నిర్ణయిస్తే జ్యుడిషియరీ కుదరదు పొమ్మన్నది! అంతటి స్వతంత్ర నిర్ణయాలు ఇతర దేశాల్లో ప్రభుత్వాలు తీసుకోవడం కష్టం. సర్దుబాట్లే ఎక్కువ. మొదటి నుంచీ అమెరికా ‘డివిజన్ ఆఫ్ పవర్స్ ‘ను రాజ్యాంగపరంగా ఏర్పరుచుకొని ఫెడరల్ వ్యవస్థను నడుపుతున్నది. రాష్ట్రాలు కొంత మేర స్వయంప్రతిపత్తితోనే వ్యవహరిస్తాయి. ఫెడరల్ వ్యవస్థ ‘టాబ్’ గా ఏర్పడినదవటం వల్ల ఒక్కొకప్పుడు రాష్ట్రా లూ, గవర్నర్లు, సెనేట్, జ్యుడిషియరీ స్వతంత్రంగా అవసర మైతే అధ్యక్షుడికి వ్యతిరేకంగా కూడా నిర్ణయాలు తీసుకొనేం దుకు వెనకాడవు. సుప్రీంకోర్టు నిర్ణయం డోనాల్డ్ ట్రంప్విదే శాంగ విధానానికి గట్టిదెబ్బగా మారింది. ప్రెసిడెంట్ ఇంటర్ నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను (ఐఇఇపిఎ) వినియోగించి సుంకాలను ఇతర దేశాల మీద హెచ్చురీతిలో వేయటం చట్టానికి వ్యతిరేకమని కొట్టివేయడం ట్రంప్ నాటకీయ నిర్ణ యాలకు, నాటకీయంగానే చెక్ పెట్టినట్లు అయింది. ట్రంప్ నియమించిన చీఫ్ జస్టిస్ జాన్రా బర్ట్స్ మరో ఇద్దరు మాత్రం మెజార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెషనల్ ఆథరైజేషన్ లేకుండా ప్రెసిడెంట్ ట్రంప్ అసాధారణ రీతిలో అన్లిమిటెడ్ ఎమోంట్, కాలపరిమితిని పట్టించుకోకుండా ఈ సుంకాలను వేయటం సరికాదని తేల్చి చెప్పిజ్యుడిషియరీ తన ప్రత్యేకతను చాటుకుంది. మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తన ఆర్డర్లో పొందుపర్చటం గమనించ దగ్గ విషయంగా అందరూ భావిస్తున్నారు.

Read Also : PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని దౌత్యం! యూఏఈ అధ్యక్షుడితో చర్చలు

Indian Diplomacy
Indian Diplomacy

ఐఇఇఎకి సం బంధించినంతవరకు ఎగ్జిక్యూటివ్ (అంటే ఒక విధంగా ప్రెసి డెంట్) టారిఫ్స్ ను కానీ డ్యూటీసు కానీ రెగ్యులేట్ చేసే స్టాట్యూతోను గుర్తించలేదని, అందువల్ల టాక్సేషన్ను ఆథ రైజ్ చేసే విధానం ఉన్నట్లు చట్టంలో ఎత్తి చూపలేదని కూడా తమ ఆర్డర్లో పేర్కొంది. ఇంతవరకూ ఏ అధ్యక్షుడూ ఈ విధానాన్ని అమలు పర్చిన దాఖలాలు లేకపోవడంతో పాటు సాక్షాధారాలు ఏవీ తమ దృష్టికి రాకపోవటంతో అధ్యక్షుడి నిర్ణయాన్ని రద్దు చేస్తున్నామని స్పష్టంగా సుప్రీం పేర్కొంది. యధావిధిగా ప్రెసిడెంట్ కోపంతో ఊగిపోతూ సుప్రీం ఆర్డరు దాదాపు త్రోసివేసాడు. గ్లోబల్ టారిఫ్ను మొదట 15 శాతానికి పెంచుతున్నానని, అటు తర్వాత 10శాతం వరకు వైట్ హౌస్కు ఉన్న అధికారాల మేర (122 సెక్షన్, ట్రేడ్ యాక్ట్ 1974) పెంచుతున్నట్లు సోషల్ మీడి యాలో పోస్టు చేయడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ధోరణిని గుర్తు చేసినట్లయింది. అయితే ఈ రూలింగ్ ముందుముందు అనేక ఛాలెంజిలకు జ్యుడిషియల్ రివ్యూకు గురికాక తప్పకపోవచ్చు. భారతదేశం మీద సుప్రీం కోర్టు నిర్ణయం ట్రంప్ 15శాతం టారిఫ్ విధింపు, అంతకు ముందే భారత్తో చేసుకున్న ఇంటరిమ్ అగ్రిమెంట్ లాంటివి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. ట్రంప్ నిముషానికొక మాట అనటం ఇండియాతో చేసుకున్న నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పటం రష్యా, దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని స్పష్టంగా చెప్పటం ఎన్నో మరెన్నో చిక్కుముడులను విప్పాల్సిన పరిస్థితి భారత్కు ఎదురయింది. ఈ పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ప్రభుత్వం ప్రధాని మోడీ బహుశా ఈ అనిశ్చిత పరిస్థితిని దాటటానికి ఇజ్రాయిల్, కెనడా, లాంటి మరికొన్ని దేశాలతో సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుకోవటంతో పాటు ఆర్థిక స్థితిగతులను, మిలటరీ పరంగా ఆయుధసంపత్తిని, మన ఎగుమతులు పెంపొందించుకొని వాణిజ్యపరంగా బలోపేతం కావడానికి రాజకీయంగా విమర్శలూ అవరోధాలను అధిగమిస్తూ సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతున్న సూచనలు కనపడుతున్నాయి.

రెండూ బలమైన దేశాలు

అమెరికా, రష్యాలు ఒకప్పుడు ప్రపంచ దేశా లను ఏలాయి. రెండూ బలమైన దేశాలు. కొన్ని దేశాలను తమ వైపు మరల్చుకొని నాటో లాంటి కూటములు ఏర్పరు చుకొని, అణ్వాయుధ ఉత్పత్తులతోసహా తాము చెప్పిందే వినాలనే రీతిలో వ్యవహరించటం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సోవియట్ రష్యా రిపబ్లిక్ చీలిపోయింది. అప్పటి యుస్.యస్.యస్.ఆర్ ఇప్పుడు రష్యాగా ఉంది. కానీ ఆనాటి బలం ఇప్పటిరష్యాకు లోపించింది. యూని యన్ నుంచి చీలిన ఉక్రెయిన్గుడా సమవుజ్జీనన్న ధోరణిలో అమెరికా అండదండలతో రష్యాకు తలనొప్పులు తెచ్చిపెట్తు న్నది. ఇరాన్ లాంటి దేశం అమెరికా బెదరింపులకు లొంగకుండా సై అంటే సై అనటంతో అమెరికా ప్రస్తుత బలమే మిటలో ఎవరూ సరియైన అంచనాలు వేయలేకపోతున్నారు. చివరకు రష్యా కూడా అప్పుడప్పుడు అమెరికాతో సత్సంబంధాలు ఏర్పరుచుకొనే పరిస్థితిని చవిచూస్తున్నది. రష్యా, అమెరికా, ఉక్రెయిన్ లాంటి దేశాలు చమురు మీద, గనుల మీద ఆధిపత్యం సంపాదించుకొని గ్లోబల్ వ్యవస్థను శాసించే ప్రయత్నంలో ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పోరు ఇప్పట్లో తెగే సూచనలు కన్పడటం లేదు. ట్రంప్ తానే సంధి కుదురుస్తున్నానని చెబుతున్నాడు. కానీ యుద్ధ విరమణ, కాల్పుల విరమణ నిర్ణయాలు ఎప్పుడూ ఏవిధంగా సమాప్తమై, మళ్లీ యుద్ధవాతావరణ ప్రజ్వలిస్తుం దో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి వాతావరణంలో భారత్ మాత్రం గుంభనగా ఉంటూ, అవసరమనుకున్నప్పు డు అన్నిదేశాలతో సామరస్య ధోరణితో వ్యవహరిస్తూ స్నేహ వాతావరణాన్ని చెడగొట్టుకోవటం లేదు. ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ పర్యటన ఒక విధంగా బలమైన దేశాల కళ్లు తెరిపించింది. ఇజ్రాయెల్ చిన్న దేశమైనా సాంకేతికంగా, ఆధునిక యుద్ధ శైలిని ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని సమయం వచ్చినప్పుడు వెరవకుండా సంఘర్షణలలో పై చేయి తనదే అని నిరూపించుకుంటున్నది.

Indian Diplomacy
Indian Diplomacy

యూరప్ దేశాలు ఇదివరకటి మాదిరి అమెరికాను గుడ్డిగా నమ్మటం లేదన్న భావనను కలిగిస్తున్నట్లు దౌత్య (Indian Diplomacy)నిపుణులు భావిస్తున్నారు. వెస్టేషియా, సౌత్ ఏషియా, గల్ఫ్ దేశాలు, రాజకీయంగా ఎలాంటి ఛాలెంజినైనా ఎదుర్కోగలం అన్న నమ్మకంతో ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నారు. అరబ్ దేశాల వైఖరిలో మార్పు అంచనా వేయటం కష్టంకానీ, స్వతంత్ర ప్రతిపత్తితో ఏ బలమైన దేశం వెనక తోకలా ఉండకుండా వ్యవహరించే దిశగా క్రమంగా బలోపేతమవుతున్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, భారతదేశం పొరుగు దేశాలతోసఖ్యతను కాపాడుకోవటం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తూ గౌరవప్రదంగా దౌత్య (Indian Diplomacy) విధానాలనుఆచరిస్తున్న దన్న నమ్మకం దాదాపు అన్ని దేశాలలో కలుగుతున్నది. నిన్నగాక మొన్న ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇజ్ర యెల్ పార్లమెంట్ బలమైన దేశం, ప్రత్యే కత కలిగిన దేశంగా ఇండియాను అభివర్ణించటం పైపై పొగడ్తలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా భారత్ ప్రత్యేకతను గుర్తించడం వల్లే ఇజ్రాయెల్ మరింతగా భారత్కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న మాట నిజం. ఇండియా పట్ల చైనా వైఖరిలో మార్పు కనపడుతున్నా, అను కూల శత్రువుగానే ప్రస్తుతం భావించక తప్పదు. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఇండియాకు స్నేహహస్తం చాచింది. పాకి స్థాన్ రాజకీయంగా క్షీణిస్తున్న పరిస్థితులను అధిగమించలేక పోతున్నది. అందుకనే భారత్ సహజ రీతిలో ప్రతిభతో నాయకత్వ పటిమను కాపాడుకుంటూ ఆర్థిక ఎదుగుదలను చేజరినివ్వకుండా, అంతర్గత పరిస్థితులనుచక్కదిద్దుకుంటూ వ్యవహార దక్షతను ప్రదర్శించినప్పుడే దటీజ్ భారత్ అన్న ప్రత్యేకతను కాపాడుకోగలదు.
-రావులపాటి సీతారాం రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.