EPF: వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

Read Time:  1 min
వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..
వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..
FONT SIZE
GET APP

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఉపయోగించని (Inoperative Accounts) పీఎఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని రీఫండ్ చేయడంపై కేంద్ర కార్మిక శాఖ ఫోకస్ పెట్టింది. కాగా దేశ వ్యాప్తంగా 7.11 లక్షలకు పైగా ఖాతాలు వినియోగంలో లేకుండా ఉన్నాయి. ఈ ఖాతాల్లో సుమారుగా రూ. 30.52 కోట్లకు పైగా డబ్బు క్లెయిమ్ లేకుండా పడి ఉంది. ఈ అన్‌క్లెయిమ్డ్ నిధులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్‌ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్‌ ఉన్న అకౌంట్ ఖాతాలను సెటిల్‌ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఈపీఎఫ్‌ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది.

Read Also: Global Market: జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

 The unused PF amount will be transferred directly to your bank account.
The unused PF amount will be transferred directly to your bank account.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం..

సాధారణంగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోయిన EPF (EPF) ఖాతాలను ఇనాక్టివ్ అకౌంట్స్ గా పరిగణిస్తారు. ఉద్యోగం వదిలిన తర్వాత PF డబ్బును కొత్త ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయకపోవడం, ఉద్యోగి మరణించిన తర్వాత నామినీ లేదా కుటుంబ సభ్యులు క్లెయిమ్ దాఖలు చేయకపోవడం వంటి కారణాలతో ఈ ఖాతాలు నిష్క్రియ స్థితిలోకి వెళ్తాయి. రూ. 1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఇనాక్టివ్ EPF ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేయనున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా సంబంధిత ఖాతాదారుల ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఇందుకోసం ఖాతాదారులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదా క్లెయిమ్ ఫారమ్ సమర్పించాల్సిన పని ఉండదు. తొలి దశలో చిన్న బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను సెటిల్ చేసి, తరువాత పెద్ద మొత్తాలున్న ఖాతాలపై కూడా దశలవారీగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో EPF ఖాతాలు ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ప్రభుత్వం సూచనలు ఇస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.