Gold: MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

Read Time:  1 min
MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్
MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్
FONT SIZE
GET APP

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ డాలర్ పుంజుకోవడంతో పసిడి ధరలు దిగి వచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇదే సమయంలో డాలర్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను అటు మళ్లించారు. దీంతో విలువైన లోహాలకు డిమాండ్ తగ్గింది. ధరలు నేల చూపులు చూశాయి. అయితే ఈ తగ్గుదల ఎంతకాలం ఉంటుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికికైతే ధరలు తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ఫిబ్రవరి 24, మంగళవారం ఉదయం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం(Gold) ధరలు తగ్గాయి. గత సెషన్‌లో భారీ లాభాలు నమోదు కావడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.

Read Also: Japan Punch: ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

  Gold: Gold and silver prices fall on MCX.. Dollar rebounds unexpectedly
Gold: Gold and silver prices fall on MCX.. Dollar rebounds unexpectedly

అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్..

దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన Gold ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.50 శాతం కంటే ఎక్కువ తగ్గి రూ. 1,60,750 వద్ద ట్రేడైంది. అదే సమయంలో ఏప్రిల్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.20 శాతం తగ్గి కిలోకు రూ. 2,64,972కి చేరుకుంది. ఇది గత సెషన్‌లో నమోదైన బలమైన ర్యాలీ తర్వాత వచ్చిన సహజమైన సవరణగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మునుపటి ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. MCX ఏప్రిల్ Gold ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ దాదాపు 3 శాతం ఎగసి 10 గ్రాములకు రూ. 1,61,550 వద్ద ముగిసింది. అలాగే MCX మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ సుమారు 5 శాతం లాభంతో కిలోగ్రాముకు రూ. 2,65,279 వద్ద ముగియడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.