Ginger juice in buttermilk : మజ్జిగల్లో అల్లం రసాన్ని కలిపితే ఎన్ని లాభాలో…

Read Time:  1 min
Ginger juice in buttermilk
Ginger juice in buttermilk
FONT SIZE
GET APP

పెరుగును చిలకడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా వేసుకోవడం వల్ల దాని రుచి పెరుగుతుంది. మజ్జిగ సూపర్‌ సమ్మర్‌ స్పెషల్ డ్రింక్‌ అవుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, మజ్జిగలో ఒక్క స్పూన్‌ అల్లం రసాన్ని (Ginger juice in buttermilk )కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చ్చు. మజ్జిగలో చెంచా అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే చాలా మంచిదని పోషకాహార, ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని (Ginger juice in buttermilk )తాగితే బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోని లాక్టోజ్‌, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

Read Also : http://Tips for Hair Growth: ఒత్తైన జుట్టు కోసం తీసుకోవాల్సిన ఆహారాలు

Ginger juice in buttermilk
Ginger juice in buttermilk

ప్రతిరోజూ గ్లాసుడు మజ్జిగలో ఒక స్పూన్‌ అల్లం రసం కలిపి తాగడం వల్ల కొవ్వు కణాల విచ్ఛిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అల్లం యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో మజ్జిగ, అల్లం రసాన్ని చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.