Japan: ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

Read Time:  1 min
ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..
ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..
FONT SIZE
GET APP

జపాన్‌(Japan)కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం అయింది. తల్లితో పాటు మిగిలిన కోతులు కూడా పంచ్‌ను అక్కున చేర్చుకున్నాయి. పంచ్ తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతోంది. తన గుంపుతో కలిసి చక్కగా ఆడుతూ, పాడుతూ తిరుగుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. పంచ్ కున్ (ముద్దుగా పంచ్) అనే కోతి పిల్ల 2025 జులైలో జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే తల్లి పంచ్‌ను దూరం పెట్టింది. మళ్లీ దగ్గరకు తీసుకోలేదు. కేవలం తల్లి మాత్రమే కాదు.. గుంపులోని మిగిలిన కోతులు కూడా పంచ్‌ను దగ్గరకు రానివ్వలేదు.

Read Also: rump tariffs impact : ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

 Japan: Finally, the story of Monkey Punch has a happy ending..
Japan: Finally, the story of Monkey Punch has a happy ending..

జూ సిబ్బంది 24 గంటలూ పంచ్ ఆరోగ్యంపై దృష్టి

తల్లి దూరం పెట్టడంతో జూ సిబ్బంది 24 గంటలూ పంచ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎమోషనల్‌గా దెబ్బతినకుండా ఉండటానికి బ్లాంకెట్స్, బొమ్మలు ఇచ్చారు. పంచ్ ఒరంగుటాన్ బొమ్మను తనతో పాటు పెట్టుకుంది. ఆ బొమ్మతోటే అటు, ఇటు తిరుగుతూ ఉంది. పంచ్ బొమ్మతో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంచ్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. కేవలం పంచ్‌ను చూడ్డానికి జూకు జనం క్యూలు కట్టారు. పంచ్‌ను తల్లి దూరం పెట్టిన కథ తెలిసి జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పంచ్‌ను కోతుల గుంపు అక్కున చేర్చుకుంది. పంచ్ తల్లి ఒడిలో నిద్రపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘దేవుడు పంచ్‌ను కరుణించాడు. పంచ్‌ను తల్లితో పాటు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.