हिन्दी | Epaper

farmer : అన్నదాతకు ‘అకాల’ కష్టాలు

Sudha
farmer : అన్నదాతకు ‘అకాల’ కష్టాలు

కా లంకాని కాలంలో పొద్దుపొడిచినా, వాన కురిసినా, చీకటి విప్పారినా విచిత్రమే. అంతే కాదు వరుణదేవుని కరుణాకటాక్షాలకోసంఎదురు చూసి నిరుత్సాహపడే రైతుకు పంట పనమీదనో, పండు చెట్టుకో వేలాడుతున్నప్పుడు వరుణుడు కాస్సేపు బీభత్సం సృష్టించినా మిగిలేది దుఃఖమే. ఆ దుఃఖప్రాప్తికి కారణం వాతావరణ మార్పులే. నిన్న, మొన్న తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరివిగా కురిసాయి. పంట పరిపక్వ దశలోనూ, దిగుబడులు వచ్చే సమయంలో చిన్నపాటి చినుకయినా పంట ఊపిరి తీస్తుంది. అదే జరిగింది. పగటి పూట ఎండలున్నా రాత్రిపూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులు వీచాయి. ఈదురు గాలికి చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడి బాగా విద్యుత్ అంతరాయమయ్యింది. తెలంగాణలోని కాళేశ్వరం, పూస్కపల్లి, మజీద్ పల్లిలో అక్కడక్కడ చేలో ఆరబోసిన మిరపపంట తడిసిపోయింది. మజీద్ పల్లిలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేల కొరిగింది. వాతావరణ మార్పులకు మామిడిపూత రాలిపోతోంది. ఇప్పుడే మామిడి సీజన్. ఈ సీజన్లో వాతావరణంలో తేడా వచ్చి పూత రాలిపోతే మామిడి రైతు (farmer)ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. చెన్నూరు మండలంలోని కన్నెపల్లి గ్రామానికి రహదారిలో ఎల్లబోయిన్ మల్లేష్కా ఐదెకరాల మామిడితోట ఉంది. మంచి దిగుబడి, సస్య రక్షణ కోసం ఎంతో ఖర్చుచేశాడు. తీరా వాతావరణంలోని మార్పులు మామిడి పూత మీదపడింది. దాంతో ఇంట్లో పురుగుమందు తాగగా ఆదివారం మృతి చెందాడు. మరెందరో మామిడి రైతులు అకాల వర్షానికి భీతిచెంది ఆందోళనగా
ఉన్నారు. ఖానాపూర్ మండలంలో భారీ ఎత్తు మామిడి పూత రాలిపోయింది.

Read Also: Digital platforms: ఆన్‌లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: వైష్ణవ్

 farmer
farmer

నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కళ్లాల్లో ఆరబోసిన పసుపుకొమ్ములు తడిసాయి. మార్కెట్ యార్డుల్లో అమ్మ కానికి తీసుకొచ్చిన పసుపు పంట తడిసింది. కాగా రైతులు (farmer)టార్పిలిన్లు కప్పాలని ప్రయత్నించే లోపు బాగా తడిసి, నీరు నిల్వ ఉండిపోయింది. జిల్లాలో 24వేల ఎకరాల్లో పసుపు సాగు జరిగింది. మొత్తమంతా వాన దేవుడిపరమే. ఆంధ్రప్రదేశ్లో వరి పంటకు చాలా నష్టమైంది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో పంటలు నేలనంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షి ణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందుగానే వాచ్చరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ లంలో భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని వికారా బాద్, తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడ గండ్ల వానలు కురిసాయి. గాలివాన బీభత్సంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాలవర్షాలు రైతులే కాదుచిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. జొన్న, పత్తి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి, నువ్వు, శనగ, పెసర, మిర్చి పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈసారి వాతావరణ మార్పు ఏ ప్రాంతాన్నో కాకుండా దాదాపు అన్ని ప్రాంతా ల్లోనూ అకాల వర్షాలు చుట్టుముట్టాయి. దక్షిణ కర్ణాటక నుంచి మరఠ్వాడ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ గ్యాంగ్లిక్ ప్రాంతం నుంచి తూర్పు కోస్తాంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. చినుకులు ఉండేది రెండే రోజు లైనా వాన బీభత్సం పంటలను వర్షార్పణం చేసింది. వర్షం వస్తున్నప్పుడు వచ్చే శబ్దాలేమిటో తెరిపిచ్చాక కానీ తెలియదు. పంట నష్టమూ అంతే. అకాల వర్ష పర్యవసానం ఎన్నో వృక్షాలను నేలకూల్చింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పనికిరాకుండా పోయాయి.

 farmer
farmer

ప్రస్తుతం మామిడి రైతు పరిస్థితి దుర్భరంగా మారింది. చలి తీవ్రత వలన పూత ఆలస్యమైంది. తీరా పూత మొదలయ్యాకపండయ్యే సమయంలో ఎలాంటి అకాల వర్షాలు వచ్చినా రైతునెత్తి మీద పిడుగుపడినట్లే. నవంబర్లో రావాల్సిన పూత జనవరిలో వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో పూత మెరుగ్గాఉంది. ఇక తాజా వాతావరణ మార్పులతో చీడపీడలు ఆశించి బూజు పట్టి పిందెలు రాలిపోతున్నాయి. తెలంగాణ జిల్లా ల్లో మొన్న రాత్రి మంచి వర్షం కురిసింది. మామిడి దిగు బడులు బాగా తగ్గిపోతాయని రైతాంగంలో ఆందోళన బయలు దేరింది. ఇదిలా ఉంటే ఆయా ప్రాంతాలలో వ్యవసాయ అధికారులు తక్షణమే రైతుకు ఊరటకలిగించే సహాయ సహకారాలు అందించాల్సిన తరుణం ఆసన్న మైంది. తక్షణమే పంట నష్టాలను అంచనా వేసి ఆర్థిక సహాయం అందచేయడం తక్షణ కర్తవ్యంగా భావించాలి. దీనస్థితిలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసు కుంటే తప్ప మరో పంటపై దృష్టి పెట్టలేడు. చేతికొచ్చిన పంట నేల కొరిగి తడిసి పోయిన కారణంగా మళ్లీ వాటిని ఒబ్బిడి చేసుకునేందుకు తాత్కాలిక సహాయం అందించే నిర్ణయం తీసుకోవాలి. మంగళవారం హైదరాబాద్ నగరంలో కూడా అకాలవర్షం ముంచెత్తింది. నగరమంతా ట్రాఫిక్ జామ్, దాటుకుని ఇల్లు చేరడానికి నగరవాసులకు చాలా కష్టమైంది. కొన్ని ఆరుతడి పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు ఆనందపడ్తున్నారు. తెలంగాణ లోని జంటనగరాలు ఆరెంజ్ అలర్ట్ నీడన ఉన్నాయి. మరో రెండురోజులు వరాల తప్పవన్నసంకేతమిది. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కుదామన్నా మళ్లీ వాన రాకడ సమా చారంతో రైతు మళ్లీ వర్షమొస్తే ఎలారా భగవంతుడా! అని ఆకాశం కేసి చూస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యాలలో నష్టపోయిన రైతునిక ప్రభుత్వమే ఆదుకోవాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870