Nitin Gadkari: బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

Read Time:  1 min
బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!
బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!
FONT SIZE
GET APP

దక్షిణ భారతదేశంలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాలైన బెంగళూరు (Bengaluru) ,చెన్నై (Chennai) మధ్య ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన వార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే’ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇటీవల జరిగిన ‘బిల్డ్ ఇండియా ఇన్‌ఫ్రా అవార్డ్స్’ మూడవ ఎడిషన్‌ లో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. 260 కిలోమీటర్లు.. కేవలం 2 గంటల్లో! సాధారణంగా బెంగళూరు (Bengaluru) నుంచి చెన్నైకి వెళ్లాలంటే ట్రాఫిక్ , ప్రస్తుతం ఉన్న రహదారుల ద్వారా కనీసం 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. కానీ, ఈ కొత్త 260 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. ఈ దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఇంధన పొదుపుకు , కాలుష్య నివారణకు కూడా ఎంతో దోహదపడుతుంది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణం ఎలాగైతే రెండు గంటలకు తగ్గిందో అదే తరహాలో దక్షిణ భారత్‌లో కూడా ఈ మార్పు రాబోతోంది.

Read Also: Mamata Banerjee: కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

 Nitin Gadkari: Bengaluru-Chennai.. in just 2 hours!
Nitin Gadkari: Bengaluru-Chennai.. in just 2 hours!

ఉత్తర భారతం , దక్షిణ భారతం మధ్య కనెక్టివిటీ

కేవలం ప్రయాణ సమయం తగ్గించడమే కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా రహదారులను నిర్మించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా టన్నెల్స్ (సొరంగాలు) నిర్మాణంలో భారత్‌ కు ఉన్న సామర్థ్యాన్ని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ, చెన్నై మధ్య దూరాన్ని కూడా సుమారు 320 కిలోమీటర్ల మేర తగ్గించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల ఉత్తర భారతం , దక్షిణ భారతం మధ్య కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ , కొత్త టెక్నాలజీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ రహిత ప్రయాణంపై కేంద్రం మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయోగాలు చేస్తోంది. పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.