Andhra pradesh politics: శాసనమండలిలో మాటల యుద్ధం

Read Time:  1 min
War of words in the council
War of words in the council
FONT SIZE
GET APP

రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైసిపి సభ్యులు ఆరోపించారు.

  • సోము వీర్రాజుపై బొత్స కామెంట్లు, తప్పుపట్టిన మంత్రి లోకేష్
  • ఆధారాల్లేకుండా మాట్లొద్దని మంత్రి అనిత హితవు
  • వైసిపి పాలనంతా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడమే: అధికార పక్ష ఎమ్మెల్సీలు

సచివాలయం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి 9వ రోజు సమావేశం చైర్మన్ మోషేన్ రాజు అధ్యక్షతన ప్రారంభమైంది. లఘు చర్చలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పాలన నడుస్తోందని ఆరోపించారు. వైసిపి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఏపీ పోలీస్ వెబ్‌సైట్ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ యాప్ పేరు మార్చి ఇప్పుడు అదే యాప్‌ను ప్రశంసిస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన బాధితులపైనే రివర్స్ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.

Read also: AP: అనంతపురంలో రెండు కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల

War of words in the council

War of words in the council

శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 2019–24 కాలంలోని పాలనను మరచిపోలేక ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని వైసిపి సభ్యులు భావిస్తున్నారని అన్నారు. గతంలో జీవో నంబర్ 1 తీసుకొచ్చి సభలు, సమావేశాలు జరగకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వలేదని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనేక కేసులు నమోదు చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణ ఘటనను కూడా ప్రస్తావించారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్ మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలతో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

ఆధారాలు చూపాలంటూ ప్రభుత్వ స్పందన

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ గతంలో ప్రజావేదికను కూల్చివేసిన ఘటనను గుర్తుచేశారు. మీరు అమలు చేసింది బ్లూ బుక్‌నా, ఎల్లో బుక్‌నా అని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసుల విషయాన్ని ప్రస్తావించగా సభలో నవ్వులు పూశాయి. ఆయన వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ గత ప్రభుత్వంలో భద్రతా లోపాలపై కేంద్రం నోటీసు జారీ చేసిందని గుర్తుచేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని సూచించారు. రెడ్ బుక్ నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.