Trump: దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..

Read Time:  1 min
దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..
దేశాన్ని విడిచి వెళ్లిపోతున్న అమెరికన్లు..
FONT SIZE
GET APP

దశాబ్దాల నుంచి అవకాశాల పరంగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న అమెరికాలో తాజాగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లేవారి కంటే అమెరికా నుంచి ఇతర దేశాలకు వలస వెళుతున్న అమెరికన్ల సంఖ్య ఎక్కువవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా పౌరులు స్వదేశాన్నీ వీడి ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ప్రముఖ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) దీనిపై సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. దాదాపు 90 ఏళ్ల క్రితం మహా మాంద్యం సమయంలో కనిపించిన పరిస్థితులు ఇప్పుడు మళ్లీ అమెరికాలో పునరావృతమవుతున్నాయని స్పష్టం చేసింది.

Read Also: Bihar: పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు

Americans leaving the country..
Americans leaving the country..

వలసల వెల్లువకు ‘డొనాల్డ్ డాష్’ అనే పేరు

అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పుకు గణాంకాలే స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రముఖ థింక్‌ట్యాంక్ Brookings Institution అంచనాల ప్రకారం.. 2025లో అమెరికా నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య, దేశంలోకి వచ్చిన వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. ఫలితంగా వలసల విషయంలో అమెరికాకు సుమారు 1.5 లక్షల మంది నికర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇది గత దశాబ్దాలుగా వలసలపై ఆధారపడి ఎదిగిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 2023లో దాదాపు 60 లక్షల మంది అమెరికాకు వలస రాగా, 2025 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపోయింది. మరోవైపు కేవలం 15 దేశాల పాక్షిక సమాచారం ప్రకారమే గత ఏడాది సుమారు 1.8 లక్షల మంది అమెరికన్లు ఆ దేశాలకు శాశ్వతంగా లేదా దీర్ఘకాల వసతి కోసం వలస వెళ్లినట్లు తెలుస్తోంది.

అంటే వలసల ప్రవాహం అమెరికా వైపు కాకుండా బయటకు మళ్లినట్లు అర్థమవుతోంది. ఈ వలసల వెల్లువకు కొందరు ‘డొనాల్డ్ డాష్’ అనే పేరు పెట్టినా.. దీనికి రాజకీయాలకన్నా విస్తృతమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల ధరలు, వైద్య ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మరోవైపు రిమోట్ వర్క్ సంస్కృతి విస్తరించడంతో అమెరికాలో ఉండాల్సిన అవసరం తగ్గింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.