nani 2

Tollywood: అమ్మ బాబోయ్.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే.. ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.

ఇప్పుడు సోషల్ మీడియా ఎంతో మందికి పేరు ప్రఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా అనేక మంది అమ్మాయిలకు సినీ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను అందిస్తోంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ డాన్స్ వీడియోలు చేస్తూ తమ ప్రతిభను చూపిస్తున్న వారు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇన్‌స్టా ప్రొఫైల్‌ ద్వారా నేరుగా హీరోయిన్‌గా ఎంపిక అవుతున్న వారూ ఉన్నారు అలాంటి వారిలో దృష్టి తల్వార్ ఒకరు దృష్టి తల్వార్ ఢిల్లీకి చెందిన అందాల రాక్షసి ఆమె 1998 ఆగస్ట్ 30న జన్మించింది దృష్టి మొదట టిక్‌టాక్ వీడియోస్ తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఇన్‌స్టాలో రీల్స్ చేయడం ద్వారా గుర్తింపు పొందింది ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ కావడంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2022లో పంజాబీ సినిమాగా విడుదలైన చోబ్బర్ ద్వారా దృష్టి తన సినీ ప్రస్థానం ప్రారంభించింది పంజాబీ చిత్రాల్లో వరుస అవకాశాలు పొందడమే కాకుండా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ క్రేజ్‌తో దృష్టి టాలీవుడ్‌ ఇండస్ట్రీకి కూడా అడుగుపెట్టింది ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న చిత్రంలో ఆమె మృణాల్ ఠాకూర్ చెల్లెలు పాత్రలో నటించింది ఇందులో ఆమె తన సహజ నటనతో ఆకట్టుకుంది ఆమె ప్రైవేట్ సాంగ్స్‌లో కూడా నటించింది ముఖ్యంగా తాజాగా విడుదలైన ఫ్లై అనే పంజాబీ పాటలో ఆకట్టుకుంది.

ప్రస్తుతం దృష్టి తల్వార్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 139 కే ఫాలోవర్స్‌ ఉన్నారు తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో ఆమె గురించి అభిమానులు సెర్చ్ చేయడం ప్రారంభించారు హాయ్ నాన్న సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఇందులో మృణాల్ ఠాకూర్ నాని నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదే సమయంలో దృష్టి తల్వార్ మృణాల్ చెల్లెలుగా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ అమ్మడు పంజాబీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ టాలీవుడ్‌లో కూడా తానొక్క మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోంది.

    Related Posts
    నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్..
    నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.తన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలను Read more

    నాని బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా
    nani

    నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో దసరా ఒకటి. మాస్ లుక్‌లో నాని కనిపించి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న ఈ సినిమా, లవర్ బాయ్ ఇమేజ్‌లో Read more

    పుష్ప-2 పై మరో క్రేజీ బజ్ ఏమిటంటే
    Allu Arjun in Pushpa 2

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ తన ప్రత్యేక Read more

    ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ
    Little Hearts movie

    మలయాళ చిత్రసీమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న రొమాంటిక్ కామెడీ 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *