Today Gold Rate 12/09/2025 : అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ చేస్తుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. MCXలో శుక్రవారం ఉదయం బంగారం ధరలు పెరిగి, వెండి (Today Gold Rate 12/09/2025) కొత్త రికార్డును నమోదు చేసింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.46% పెరిగి 10 గ్రాములకు ₹1,09,485 వద్ద ట్రేడ్ కాగా, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.91% పెరిగి కిలోకు ₹1,28,095 చేరింది. గతంలో గోల్డ్ ₹1,09,840, సిల్వర్ ₹1,28,533 రికార్డు స్థాయిలను తాకాయి.
నిపుణుల అంచనా ప్రకారం, US ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతుండటంతో కనీసం మూడు రేట్ కట్స్ వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లపై లాభాలు తగ్గుతాయి. ఫలితంగా బంగారం పెట్టుబడిగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. 2025 చివరినాటికి MCXలో బంగారం ధరలు 10 గ్రాములకు ₹1,15,000 వరకు పెరగవచ్చని, వెండి ధరలు సుమారు ₹1,26,000 వద్ద కొనుగోలు చేస్తే లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భారత మార్కెట్లోనూ బంగారం ధరలు గణనీయమైన స్థాయిలోనే ఉన్నాయి. రాబోయే పండుగ సీజన్‌లో బంగారం, వెండి ఆభరణాల కొనుగోలు పెరుగుతుందని, ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం 24 క్యారెట్ మరియు 22 క్యారెట్ బంగారం ధరలు 1 లక్షకు మించి ఉండటంతో వినియోగదారులు కొనుగోళ్లలో ఇబ్బందులు పడుతున్నారు.
24 క్యారెట్ బంగారం ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాడతారు. 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం ప్రధానంగా ఆభరణాల తయారీలో వాడతారు.
ఈరోజు భారతదేశంలో బంగారం ధరలు (సెప్టెంబర్ 12, 2025)
24 క్యారెట్ గోల్డ్ రేట్ (₹/గ్రామ్): ₹11,128
22 క్యారెట్ గోల్డ్ రేట్ (₹/గ్రామ్): ₹10,200
18 క్యారెట్ గోల్డ్ రేట్ (₹/గ్రామ్): ₹8,346
24 క్యారెట్ గోల్డ్ రేట్ (INR)
| గ్రాములు | ఈరోజు ధర | నిన్నటి ధర | మార్పు |
|---|---|---|---|
| 1 | ₹11,128 | ₹11,050.90 | +₹77.10 |
| 8 | ₹89,024 | ₹88,407.20 | +₹616.80 |
| 10 | ₹1,11,280 | ₹1,10,509 | +₹771 |
| 100 | ₹11,12,800 | ₹11,05,090 | +₹7,710 |
22 క్యారెట్ గోల్డ్ రేట్ (INR)
| గ్రాములు | ఈరోజు ధర | నిన్నటి ధర | మార్పు |
|---|---|---|---|
| 1 | ₹10,200 | ₹10,130 | +₹70 |
| 8 | ₹81,600 | ₹81,040 | +₹560 |
| 10 | ₹1,02,000 | ₹1,01,300 | +₹700 |
| 100 | ₹10,20,000 | ₹10,13,000 | +₹7,000 |
18 క్యారెట్ గోల్డ్ రేట్ (INR)
| గ్రాములు | ఈరోజు ధర | నిన్నటి ధర | మార్పు |
|---|---|---|---|
| 1 | ₹8,346 | ₹8,288 | +₹58 |
| 8 | ₹66,768 | ₹66,304 | +₹464 |
| 10 | ₹83,460 | ₹82,880 | +₹580 |
| 100 | ₹8,34,600 | ₹8,28,800 | +₹5,800 |
భారత ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (₹/గ్రామ్)
| నగరం | 24K గోల్డ్ | 22K గోల్డ్ | 18K గోల్డ్ |
|---|---|---|---|
| చెన్నై | ₹11,171 | ₹10,240 | ₹8,475 |
| ముంబై | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| ఢిల్లీ | ₹11,143 | ₹10,215 | ₹8,361 |
| కోల్‌కతా | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| బెంగళూరు | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| హైదరాబాద్ | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| కేరళ | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| పుణే | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| వడోదరా | ₹11,133 | ₹10,205 | ₹8,351 |
| అహ్మదాబాద్ | ₹11,133 | ₹10,205 | ₹8,351 |
| జైపూర్ | ₹11,143 | ₹10,215 | ₹8,361 |
| లక్నో | ₹11,143 | ₹10,215 | ₹8,361 |
| కోయంబత్తూరు | ₹11,171 | ₹10,240 | ₹8,475 |
| మదురై | ₹11,171 | ₹10,240 | ₹8,475 |
| విజయవాడ | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| పాట్నా | ₹11,133 | ₹10,205 | ₹8,351 |
| నాగపూర్ | ₹11,128 | ₹10,200 | ₹8,346 |
| చండీగఢ్ | ₹11,143 | ₹10,215 | ₹8,361 |
| సూరత్ | ₹11,133 | ₹10,205 | ₹8,351 |
| భువనేశ్వర్ | ₹11,128 | ₹10,200 | ₹8,346 |