Today Gold Rate 11/09/2025 : సెప్టెంబర్ 11వ తేదీ గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,11,600గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,01,100గా ఉంది. (Today Gold Rate 11/09/2025) ఒక కిలో వెండి ధర ₹1,28,600 పలికింది. అయినప్పటికీ బంగారం ధర ఇంకా ఆల్‌టైమ్ రికార్డు సమీపంలోనే కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు.
నిన్నటి కంటే ఈరోజు ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గత రెండు వారాలుగా రోజుకు సుమారు వెయ్యి రూపాయల చొప్పున పెరుగుతూ వస్తున్నాయి. బంగారం ధర పెరగడానికి ముఖ్య కారణం డాలర్ విలువ పడిపోవడం, అలాగే స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి అని విశ్లేషకులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో నష్టాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం సహజం. ఎందుకంటే బంగారం ఎప్పటినుంచో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించబడుతోంది.
బంగారం ధరల పెరుగుదలలో మరో ముఖ్య కారణం చైనా సెంట్రల్ బ్యాంక్ విపరీతంగా బంగారం నిల్వలను కొనుగోలు చేయడం. ఈ నేపథ్యంలో ధరలు మరింత ఎగబాకే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ పెరుగుదల బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి లాభదాయకంగా ఉన్నప్పటికీ, బంగారు ఆభరణాలు కొనేవారికి మాత్రం పెరుగుతున్న ధరలు భారంగా మారాయి. నగల దుకాణాల యజమానుల ప్రకారం, ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి.
ఇక వెండి విషయానికి వస్తే, బంగారంతో పాటు వెండి ధర కూడా చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర ₹1,28,600 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో వెండి డిమాండ్ పెరగడమే అని నిపుణులు పేర్కొన్నారు.
Read also :