Today Gold Rate : భారతదేశంలో ఈ వారం ట్రేడింగ్ సెషన్ బంగారం ధరలు స్వల్ప తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం ధరలు కాస్త తగ్గాయి. (Today Gold Rate) MCXలో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ రూ.1,08,500 దగ్గర ట్రేడయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతపై అంచనాలు పెరగడంతో బంగారం దిశ బుల్లిష్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 8న 24 క్యారెట్ బంగారం ధర రూ.1,08,380 (10 గ్రాములు), 22 క్యారెట్ రూ.99,350 గా నమోదైంది. సెప్టెంబర్ 6న నమోదైన ఆల్ టైమ్ హై నుండి ధరలు కొంచెం వెనక్కి తగ్గినా, సెప్టెంబర్ మొదటి 8 రోజుల్లో బంగారం ధరలు 2.4% పెరిగాయి.
వెండి ధరలు కూడా సెప్టెంబర్ 8న తగ్గాయి. 1 కిలో వెండి రూ.1,27,000 నుండి రూ.1,000 పడిపోయి రూ.1,26,000గా నమోదైంది. 100 గ్రాములు రూ.12,700, 10 గ్రాములు రూ.1,270 వద్ద ఉన్నాయి.
MCXలో అక్టోబర్ 2025 గడువు గల బంగారం ఫ్యూచర్స్ రూ.1,08,495 వద్ద ముగిసింది. మరోవైపు డిసెంబర్ 2025 గడువు గల వెండి ఫ్యూచర్స్ రూ.1,25,412 వద్ద క్లోజ్ అయ్యాయి.
నిపుణులు చెబుతున్నట్లుగా, అమెరికా CPI, Core CPI డేటా ఈ వారం బంగారం ట్రెండ్‌పై ప్రభావం చూపుతుంది. గోల్డ్ ధరలకు $3560 / రూ.1,06,500 వద్ద సపోర్ట్ ఉండగా, $3650 / రూ.1,09,500 వద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది.
నగరాల వారీగా బంగారం ధరలు (సెప్టెంబర్ 9, 2025)
| నగరం | 24 క్యారెట్ ధర (₹/10g) | 22 క్యారెట్ ధర (₹/10g) |
|---|---|---|
| ఢిల్లీ | ₹1,08,530 | ₹99,500 |
| ముంబై | ₹1,08,380 | ₹99,350 |
| చెన్నై | ₹1,08,770 | ₹99,700 |
| కోల్కతా | ₹1,08,380 | ₹99,350 |
| బెంగళూరు | ₹1,08,380 | ₹99,350 |
| జైపూర్ | ₹1,08,530 | ₹99,500 |
| లక్నో | ₹1,08,530 | ₹99,500 |
| హైదరాబాద్ | ₹1,08,500 | ₹99,350 |
| అహ్మదాబాద్ | ₹1,08,410 | ₹99,400 |
Read also :