हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirumala: వడ్డీకాసులవాని దర్శనానికి గణనీయంగా పెరిగిన భక్తులు

Ramya
Tirumala: వడ్డీకాసులవాని దర్శనానికి గణనీయంగా పెరిగిన భక్తులు

24.08లక్షల మంది దర్శనం, రూ.116.86 కోట్లు హుండీ ఆదాయం

Tirumala: ఆవదమొక్కులవాడు, ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామిని జూన్నెలలో అత్యధికంగా 24.08 లక్షలమందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గట్లు తమ మొక్కుబడుల్లో భాగంగా కానుకల రూపంలో హుండీకి 116.86కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. గత ఏడాది జూన్నెలకంటే భక్తుల సంఖ్య 2లక్షమంది అదనంగా దేవదేవుడిని దర్శనం చేసుకోవడం విశేషం. ముఖ్యంగా జూన్నెలలో గురు, శుక్ర, శనివారాల్లో అదనంగా మరో పదివేలమందికి పైగా భక్తులకు ఆయా రోజుల్లో శ్రీవారి దర్శనం చేసుకునేలా చూడటం ఈ రికార్డుస్థాయి దర్శనాలకు కారణమైంది. గత ఏడాది జూన్నలలో 113.65కోట్ల రూపాయలు కానుకల ద్వారా హుంఢీ ఆదాయం నమోదైంది. ఈ ఏడాది జూన్ 116.86కోట్ల రూపాయలు (3.255 అదనంగా ) రాబడి లభించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి దర్శనాలకు దేశవిదేశాల నుండి తిరుమల (Tirumala) కు వస్తున్న భక్తుల సంఖ్య నెలనెలా రెట్టింపవుతోంది. గడచిన జూన్నెలలో వేసవిసెలవుల రద్దీ కొన సాగడంతో భారీగా భక్తులు ఇష్టదైవం దర్శనానికి తరలిరావడం జరిగింది. జూన్నెలకు సంబంధించి 30రోజుల హుండీ ఆదాయం కూడా వందకోట్లు దాటడం విశేషం. రోజుకు లక్షమంది వరకు భక్తులు కొండకు చేరు కుం టుండగా 80వేలమందివరకు దర్శనం చేసుకోగలుగుతున్నారు. హిందూ భక్తులు తమ కష్టాల్లో, ఆపదల్లో ముడుపుగా కట్టిన మొక్కులు చెల్లించు కునేందుకు కానుకల రూపంలో హుండీలో నగదు, నగలు సమర్పి స్తున్నారు.

Tirumala

హుండీ ఆదాయంలో పెరుగుదల – జూన్ నెలలో 116.86 కోట్లు

ఈ ఆదాయం పరిగణన లోనికి తీసుకునే టిటిడి వార్షిక బడ్జెట్ రూపకల్పన చేస్తుంది. గడచిన జూన్ నెలకు సంబంధించి హుండీ ఆదాయం గమనిస్తే జూన్ 30వతేదీ హుంఢీ ద్వారా 5.30కోట్లు రూపాయలు, 20వతేదీ 4.88కోట్లు రూపాయలు, 23న 4.72కోట్లు, జూన్ 15వతేదీ 4.525 కోట్లు , 29న 4.34కోట్లు, 21న 4.30, 3న 4.29కోట్లు ఇలా వరుసగా 4కోట్లరూపాయలు దాటిన రోజులే ఎక్కువ. ఆ నెలలో వరుసగా సరాసరి 3.40కోట్ల రూపాయల పైగానే ఆదాయం చేకూరడంతో 30రోజులకు సంబంధించి 116.86కోట్ల రూపాయలు మార్కును అధిగమించింది. ఏకంగా వడ్డీకాసుల వెంకన్నకు రానున్న మూడు నాలుగునెలలు కూడా కీలకమే. స్వామివారి హుండీ ఆదాయం మరింత రెట్టింపయ్యే సూచనలు ఉంటుందనేది వర్గాల అభిప్రాయం. జూన్నెలలో పలు రకాలుగా తిరుమలకు చేరుకుని తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 24,08,781లక్షల మంది వరకు చేరింది. జూన్ 28వతేదీ 90,051మందికి భక్తులకు వెంకన్న దర్శనం చేయించారు. 21న 90,087, 145 91,720 మంది, జూన్ 8న 90,802మంది, 15వతేదీ 90,815, 292 88,497, 225 87,254 మంది భక్తులకు, 24న 79, 466 మంది భక్తులకు, 17న 81,037 మంది భక్తులకు ఇలా సరాసరి రోజువారీగా 75వేల మంది వరకు భక్తులు మహాలఘులో ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం వెలుపల క్యూలైన్లు చేరినా టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాధం, ఆలయ పేష్కార్ రామ కృష్ణ స్వయంగా పర్యవేక్షించారు.

Read also: Jagan : మళ్లీ పాదయాత్ర చేస్తానంటున్న జగన్.. సీఎం అవుతారా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870