తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..వెలుగులో సంచలన విషయాలు

Donald Trump: తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..వెలుగులో సంచలన విషయాలు

అమెరికాలో డబ్బులివ్వలేదని తల్లిదండ్రులను ఓ యువకుడు(17) దారుణంగా కాల్చి చంపిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడని తెలిపింది. అందుకోసం డబ్బులు ఇవ్వట్లేదనే తల్లిదండ్రులపై దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఫెడరల్‌ వారెంట్‌లో అధికారులు వెల్లడించారు.

Advertisements
తల్లిదండ్రులను కాల్చి చంపిన కొడుకు..వెలుగులో సంచలన విషయాలు

ఇంటి నుంచి పరార్
విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌ అనే కుర్రాడు, ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తన నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చాడు. అనంతపరం వారిద్దరూ మృతిచెందారు. ఆ తర్వాత వారి మృతదేహాలతో పాటే నివసించాడు. అనంతరం 14వేల డాలర్లు నగదు, పాస్‌పోర్ట్‌ తదితర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాయడు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు నిందితుడి ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం మార్చిలో కాన్సస్‌లో నిందితుడు నికిటాను అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్లు వెల్లడైంది. అంతేకాకుండా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ను చంపేందుకు నికిటా కుట్ర చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
సోషల్‌మీడియా యాప్‌లలో నిందితుడు సంభాషణలు
అయితే, నిందితుడు పన్నిన దారుణమైన ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడం వల్లనే వారిని నికిటా చంపేసినట్లు తెలిసింది. వారిని చంపిన తర్వాత ఆ నిందితుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడని దర్యాప్తులో తెలిపింది. అధ్యక్షుడిని అంతమొందించే ప్లాన్​- ఓ రష్యా వ్యక్తితో కలిసి నిందితుడు వేసినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో ఇతడు సంభాషణలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అధ్యక్షుడిని చంపేసిన తర్వాత ఉక్రెయిన్‌ పారిపోవాలని నిందితుడు ప్లాన్​ వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంచలన కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. మార్చి నెలలో నికిటాను కాన్సస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నికిటా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

Related Posts
Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేస్తున్న మమతా బెనర్జీ
Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేస్తున్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రిటన్‌లో తన అధికారిక పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పశ్చిమ Read more

టర్కీలో భారీ పేలుడు: 12 మంది మృతి
turkey

టర్కీ వాయువ్య ప్రాంతంలోని బాలికేసిర్ ప్రావిన్స్‌లోని కవాక్లి గ్రామంలో ఒక పేలుడు సంభవించింది, దానికి కారణంగా 12 మంది మరణించగా, 4 మంది గాయపడ్డారు. ఈ ఘటనా Read more

AI: ఏఐ వ్యవసాయంతో ఊహించని లాభాలు
ఏఐ వ్యవసాయంతో ఊహించని లాభాలు

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇప్పటికే నూతన మార్గాలపై పయనిస్తోంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే వ్యవసాయాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా, డేటా ఆధారంగా చేయడం ప్రారంభించాయి. Read more

ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు ప్రమాదాలు.. 52 మంది మృతి
accident

ఆప్ఘనిస్థాన్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కాందహార్ హైవేపై Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×