దేశ టెక్ క్యాపిటల్ బెంగళూరు భారీ వర్షాలకు అతలాకుతలమైంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్ నీటమునిగింది. రోడ్లపై వరదనీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. నేటి నుంచి వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణశాఖ తెలిపింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisements
Advertisements