హైదరాబాద్:హైదరాబాద్ మలక్‌పేటలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శిరీష హత్యకు గురైనట్లు పోలీసులు ధృవీకరించారు. మొదట ఇది ఆత్మహత్యగా భావించిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆమెను ఊపిరాడకుండా చేసి దిండుతో అదిమిపట్టి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో శిరీష భర్త వినయ్, అతని అక్క సరిత నిందితులుగా పోలీసులు గుర్తించారు. విచారణలో సరిత ప్రధాన హంతకురాలిగా తేలినట్లు సమాచారం.
హత్యకు కారణం
వినయ్ విదేశాల్లో (ఒమన్) ఉద్యోగం చేస్తుండటంతో, అతని అక్క సరిత అక్రమ సంబంధాలు కొనసాగించిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం శిరీషకు తెలియటంతో ఆమె దీనిపై ప్రశ్నించేది. ఈ కారణంగా శిరీష, సరిత మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. శనివారం రాత్రి జరిగిన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో సరిత, శిరీషను దారుణంగా కొట్టింది. అనంతరం దిండుతో నోటిని, ముక్కును కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.హత్య జరిగిన తరువాత శిరీష మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

నిందితులను మీడియా ముందుకు
ఈ హత్య కేసులో సరితను ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు, ఆమెను విచారిస్తున్నారు. వినయ్ కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నప్పటికీ,ముందస్తు పథకం ప్రకారమేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు నిందితులిద్దరినీ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన అక్క
వినయ్ తన భార్య శిరీషకు పెళ్లి సంబంధం కుదిర్చింది తన అక్క సరితే. కానీ చివరికి ఆమెనే తన భార్యను హత్య చేయడం అతనికి షాకింగ్‌గా మారింది.తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, తన అక్క ఇంత పనిచేసిందా అని వినయ్ పోలీసుల ముందు పశ్చాతాప పడినట్లు సమాచారం. కాగా హత్య కేసులో తన అక్కకు వినయ్ కూడా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. బుధవారం హంతకులిద్దరిని పోలీసులు మీడియా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఈ హత్య కేసు ఇప్పుడు మలక్‌పేటలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు చివరకు హత్య వరకు దారితీయడం ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి,