దాదాపు రెండు నెలల పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ రెండు నెలల్లో కొన్నేళ్లుగా అంతర్యుద్ధపు మంటల్లో మండుతున్న ఈ దేశంలో బహుశా సాధారణ జీవితం ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతుందని అనిపించింది. కానీ సిరియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అధికారం నుంచి తొలగించబడిన దాదాపు రెండు నెలల తర్వాత అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మళ్లీ పోరాటం మూడ్‌లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రష్యాలో కూర్చున్న ఈ నియంత సిరియాలో ఆరిపోతున్న అగ్ని మళ్లీ రాజేశాడు. సిరియాలోని వాయవ్య ప్రాంతంలోని అలవైట్ (సిరియాలోని మైనారిటీ సమూహం) బలమైన ప్రాంతంలో తాజా హింస చెలరేగింది. అక్కడ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులను వెతికి పట్టుకుని అరెస్ట్ చేయడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి.

అధికారికంగా 200 మందికి పైగా మృతి
నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు అధికారికంగా 200 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మరణించిన వారిలో సిరియా కొత్త ప్రభుత్వానికి చెందిన చాలా మంది అధికారులు, సైనికులు ఉన్నారు. సిరియాలో అలవైట్ సమాజం ఒక మైనారిటీ సమాజం.. దీని జనాభా దేశం మొత్తం జనాభాలో 10 శాతం మాత్రమే ఉన్నారు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఈ సమాజం నుంచే వచ్చారు. వీరి కుటుంబం 50 సంవత్సరాలకు పైగా సిరియాను పాలించింది.
అనేక ప్రాంతాలలో హింసాత్మకం పోరాటం
సిరియాలో ప్రస్తుత యుద్ధానికి కారణం ఏమిటి? లటాకియా, టార్టస్ ప్రావిన్సులలో సిరియా భద్రతా దళాలు, మాజీ అధ్యక్షుడు అసద్ మద్ధతుదారుల మధ్య గురువారం నుంచి పోరాటం జరుగుతోంది. లటాకియాకు దక్షిణంగా ఉన్న తీర ప్రాంత పట్టణం జబాలేలో అత్యంత తీవ్రమైన పోరాటం కొనసాగుతోంది. అనేక ఇతర ప్రాంతాలలో కూడా హింసాత్మకం పోరాటం జరగుతోంది. అసద్ మద్దతుదారులు అనేక చోట్ల సిరియా ప్రభుత్వ దళాలపై ఆకస్మిక దాడులు చేశారు. ఆ తర్వాత కొత్త సిరియా ప్రభుత్వ ఆదేశాల మేరకు బీట్ అనన్ గ్రామంలోని తిరుగుబాటుదారులు దాక్కున్న ప్రాంతాలపై హెలికాప్టర్ల ద్వారా భీకర దాడులు జరిగాయి.
200 మందికి పైగా మృతి
200 మందికి పైగా మృతి హింసను ఆపేందుకు సిరియా ప్రభుత్వం లటాకియా, టార్టస్ ప్రావిన్స్ 24 గంటల కర్ఫ్యూను విధించింది. లటాకియా, టార్టస్ ప్రావిన్సులలో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. శుక్రవారం ఉదయం నాటికి దాదాపు 70 మంది మరణించారని.. వందల మంది గాయపడ్డారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నాటికి దాదాపు 35 మంది ప్రభుత్వ సైనికులు, 32 మంది అసద్ అనుకూల ముష్కరులు మరణించినట్లు సమాచారం. తాజా నివేదికలో 200 మందికి పైగా మరణించినట్లు నిర్ధారించబడింది.
ఇళ్లపై వైమానిక దాడులు
అలవైట్ సమాజం నివసించే ప్రాంతాల్లోనే.. గత ఏడాది డిసెంబర్ లో హయత్ తహ్రీర్ అల్-షామ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిరియాలో అసద్ మద్దతుదారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వారిని తమ ఆయుధాలతో లొంగిపోవాలని కోరారు. దీని కోసం అనేక శిబిరాలను కూడా ఏర్పాటు చేసారు. అసద్ కు అనుకూలంగా భావించే మైనారిటీ అయిన అలవైట్ సమాజం నివసించే ప్రాంతాల్లోనే హింస నెలకొంది. సిరియాలోని అలవైట్ ఇస్లామిక్ కౌన్సిల్ గురువారం కొత్త ప్రభుత్వం పౌరుల ఇళ్లపై వైమానిక దాడులు చేస్తోందని ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి తక్షణమే జోక్యం చేసుకుని ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చింది.