మూడు బిల్లుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం

Read Time:  1 min
telangana Assembly speaker
telangana Assembly speaker
FONT SIZE
GET APP

ఎలాంటి చ‌ర్చలకు తావు లేకుండానే మూడు బిల్లుల‌కు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. విరామం అనంత‌రం ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను విడుద‌ల చేయాల‌ని, ఈ అంశంపై చ‌ర్చ‌కు బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. కానీ స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్య‌నే యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, స్పోర్ట్స్ వ‌ర్సిటీ బిల్లు, విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లుల‌ను సంబంధిత మంత్రులు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.
చర్చలు లేకుండానే ఆమోదం
ఇక ఈ బిల్లుల‌పై ఎలాంటి చ‌ర్చ చేప‌ట్ట‌కుండా.. శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. మూడు బిల్లులకు ఆమోదం అనంత‌రం రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. ప‌ర్యాట‌క రంగంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌ను ప్రారంభించారు. అయితే ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను త‌క్ష‌ణ‌మే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే శాసనసభ మూడు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.