📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Future City: ఫ్యూచర్ సిటీ వచ్చేదెక్కడ? హైదరాబాద్‌కి ఎంత దూరం?

Author Icon By Vanipushpa
Updated: March 26, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్.. సికింద్రాబాద్.. సైబరాబాద్.. ఇప్పుడు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ కోర్ సిటీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త నగరం రానుందని ప్రచారం చేస్తోంది. ఇందుకు అవసరమైన భూ సేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న ఎత్తుగడంటూ విమర్శలు చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.
ఏమిటీ ఫ్యూచర్ సిటీ..
హైదరాబాద్ నగరం మొదటగా ఏర్పడింది. చారిత్రక ఆనవాళ్లు పరిశీలిస్తే.. నగరానికి భాగ్యనగరం లేదా ముత్యాల నగరంగా కూడా పేరుంది. హైదరాబాద్‌ను 1591లో మొహమ్మద్ కులీకుతుబ్ షా కట్టినట్లుగా చారిత్రక అధారాలున్నాయి. ఆ తర్వాత మూడో నిజాం సమయంలో 1800 శతాబ్దం ప్రారంభంలో మూసీ నదికి ఉత్తరాన సికింద్రాబాద్ నగరం ఏర్పాటైంది. 1990ల చివర్లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దీన్ని హైటెక్ సిటీగా పిలుస్తుంటారు. అప్పట్నుంచి హైదరాబాద్ నగరాన్ని మూడు ప్రాంతాలుగా పిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు. గత 20, 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నివాసప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 మంది హైదరాబాద్ నగరంలో నివసిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరి ఉంటుందని అంచనా.
హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనికితోడు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఇప్పుడు హెచ్ఎండీఏలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం.

ఫ్యూచర్ సిటీ ఎక్కడ రానుంది?
ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఏర్పాటు కానుంది ఫ్యూచర్ సిటీ. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్-నాగార్జున్ సాగర్ హైవే నుంచి హైదరాబాద్- శ్రీశైలం హైవే మధ్య ఉన్న ప్రాంతమిది. తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మొత్తం 12 జోన్లుగా విభజించనున్నారు. ”ఫ్యూచర్ సిటీ అనేది ప్రణాళికాబద్దమైన నగరం. మల్టీమోడల్ కనెక్టివిటీ.. బస్సు, మెట్రో రైల్, మోడ్రన్ అర్బన్ ఎమినిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ వస్తాయి.” అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో దీన్ని ఫోర్త్ సిటీగా పిలవగా.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా పేరుమార్చింది ప్రభుత్వం.
ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో

ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలున్నాయి. ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా మునిసిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ఫైనాన్స్), పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీసీ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీటీసీపీ-హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఉంటారు.
ఫార్మాసిటీ ఏమైంది?
గతంలో కందుకూరు, యాచారం మండలాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పట్లో భూసేకరణ కూడా చేపట్టింది. మొత్తం 19,333 ఎకరాల్లో 5.6 లక్షల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదాను సైతం ఇచ్చింది.


#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu How far is it from Hyderabad? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Where is Future City located?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.