📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Seethakka: సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే సంక్షేమ పథకాలు: మంత్రి సీతక్క

Author Icon By Vanipushpa
Updated: June 11, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: సదరం సర్టిఫికెట్ల(Sadaram Certificates) జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అందుకే అర్హులు చాలా మంది నష్ట పోయారని మంత్రి సీతక్క(Minister Seethakka) ఆరోపించారు. బేగంపేట లోని టూరిజం ప్లాజా(Tourism Plaza)లో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లా డుతూ.. గత అనుభవాల దృష్టిలో దివ్యాంగుల్లో వైకల్యా న్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటి సారి వర్క్ షాపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉంది అనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఒక్కో ఆస్పత్రికి పది లక్షల చొప్పున మొత్తం రూ.3.8 కోట్లను రిలీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.

Seethakka: సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే సంక్షేమ పథకాలు: మంత్రి సీతక్క

సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుం దని అన్నారు. ఈ సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. చేయూత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్స్ ఆధారమన్నారు.. అందుకే డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
వారికి ఆత్మగౌరవం దక్కాలంటే..
దివ్యాంగులకు ఆత్మగౌరవం దక్కాలంటే
డాక్టర్లు పక్కాగా పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచనలిచ్చారు. అర్హులు ఎవరు నష్టపోకూడదని, వైద్య వృత్తి అంటే ప్రాణం పోసే వృత్తి అని చెప్పారు. 21 రకాల వైకల్యాలను గుర్తించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తుకు చేశారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తున్నామని చెప్పారు. వైకల్యాన్ని సరిగ్గా నిర్ణయించేందుకు డాక్టర్లుకు ఓరియంటేషన్ ఇప్పిస్తున్నామన్నారు. ఎంతో అనుభవం ఉన్న వైద్య నిపుణులతో డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నా మన్నారు. సర్టిఫికెట్ల ఆధారంగానే దివ్యాంగులకు ఉపాధి, ఉద్యోగం, ఆత్మగౌరవం లభిస్తుందన్నారు. ఈ పవిత్ర యజంలో దివ్యాంగు లందరికి డాక్టర్లు అండగా నిలవాలన్నారు. దివ్యాంగలు పరికరాల కోసం ప్రతి సంవత్సరం రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఓరియంటేషన్ కార్యక్రమానికి 200లకు పైగా డాక్టర్లు హజరైనట్లు చెప్పారు.

Read Also: Telangana : మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు

#telugu News Ap News in Telugu based on Sadaram certificate Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu minister seethakka Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Welfare schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.