हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి

Anusha
Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను నలుగురు వ్యక్తుల స్వార్ధం కోసమే తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నాలుగు గోడల చర్చించి ఇష్టానుసారంగా ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అందుకే ఆ దొరలను ఫామ్ హౌసుకి పంపారని వ్యాఖ్యానించారు. దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారని పొంగులేటి మండిపడ్డారు. త్వరలోనే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి తెలిపారు.ఇది పేదోడి ప్రభుత్వమని ప్రజలు కోరుకున్నట్టే కాంగ్రెస్(Congress) పాలన ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇచ్చి 6 వేల మంది సర్వేయర్లను తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నాయకులు భూములను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపాదించిన భూముల వివరాలు బయటపడతాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కుటుంబం, కోటరీ రూ.కోట్ల విలువైన భూములు కాజేసిందని కామెంట్ చేశారు.అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తల తాకట్టు పెట్టి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ సిలిండర్, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పేదల వైద్యం కోసం 400 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం 1375 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. దేశంలోనే తెలంగాణని రోల్ మోడల్ గా నిలబెట్టడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

 Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి
Telangana: వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తాం: మంత్రి పొంగులేటి

భూ భారతికి భయపడి దోపిడీదారులు పారిపోయారని, అందుకే రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా మందగించిందని ఆయన అన్నారు. గత పాలకులు దొరికిచోటల్లా అప్పులు చేశారని పొంగులేటి అన్నారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల(Indiramma’s house)ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున కేటాయించామని తెలిపారు. పూర్తయిన ఇళ్లకు గాను లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఈనెల 20 నుంచి 25 వరకు ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా బుగ్గారంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

Read Also: Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870