📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Tummala Nageswara Rao: తెలంగాణ మహిళా సంఘాలకు డ్రోన్లు పంపిణి చేస్తాం

Author Icon By Anusha
Updated: June 20, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల అభివృద్ధి కోసం సంకల్పబద్ధంగా పనిచేస్తోంది. ముఖ్యంగా మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే పలు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. తాజాగా మహిళా సంఘాలకు మరో బహుమతి లాంటి శుభవార్తను తెలంగాణ ప్రభుత్వం అందించింది.తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు కేంద్రం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకం కింద డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం 381 డ్రోన్లు మహిళా సంఘాలకు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ డ్రోన్ల వినియోగం ద్వారా గ్రామీణ మహిళలు వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టి ఆధునిక సాంకేతికతను ఉపయోగించే అవకాశాన్ని పొందనున్నారు.

అధికారులకు ఆదేశాలు

ఇవి మాత్రమే కాకుండా వ్యవసాయం కోసం రైతులకు ఉపయోగకరమైన, అలానే డిమాండ్ ఉన్న అన్ని వ్యవసాయ పరికరాలను గుర్తించి వాటిని సబ్సిడీ ద్వారా అన్నదాతలకు తక్కువ ధరకే అందించాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే మార్క్ ఫెడ్ ద్వారా 1.55 లక్షల టన్నుల జొన్నలు సేకరించాలని అధికారులకు సూచించారు.అలానే పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (Minimum support price) ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది అని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. ఇప్పటికే రైతు భరోసా, రుణ మాఫీ ద్వారా అన్నదాతలను ఆదుకుంటున్నామని ఇందుకు గాను తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తుమ్మల ఈ సదర్భంగా చెప్పుకొచ్చారు.

Tummala Nageswara Rao

డ్రోన్లు పంపిణీ

మహిళా సంఘాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వారికి 10 లక్షల రూపాయల వరకు బీమా కల్పించిన సంగతి తెలిసిందే. అలానే మహిళా సంఘాల సభ్యులు చనిపోతే వారి పేరు మీద ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లోనూ మహిళా సంఘాలను (Women’s groups) ఏర్పాటు చేయాల్సిందిగా పరిసర జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇక వారి ఉపాధి పెంచడం కోసం కూడా అనేక చర్యలు చేపట్టింది. పెట్రోల్ బంకులు మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా వారికి డ్రోన్లు పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు రావడంపై మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Gone Prakash: కేసీఆర్ హాయాంలోనే ఫోన్ ట్యాపింగులు జరిగాయి: గోనె ప్రకాశ్ రావు

#RevanthReddy #TelanganaGovernment #TelanganaWomen #TummalaNageshwara Arao Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.