TS: అనుబంధ గుర్తింపు కోసం 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Read Time:  1 min
TS: అనుబంధ గుర్తింపు కోసం 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
FONT SIZE
GET APP

TS : రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేట్, కార్పొరేట్, కంపోజిట్ కాలేజీల నుంచి ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అనుబంధ గుర్తింపు కోసం ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గురువారం షెడ్యూల్ను జారీ చేశారు. మార్చి 13 వరకు ఎటువంటి ఆలస్యం రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ. 1000 లేట్ ఫీతో మార్చి 20 వరకు, రూ. 5000తో మార్చి 27 వరకు, రూ. 10వేలతో ఏప్రిల్ 3 వరకు, రూ. 15వేలతో ఏప్రిల్ 10 వరకు, రూ.20వేల ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

TS: Applications for supplementary recognition accepted from 12
TS: Applications for supplementary recognition accepted from 12

అదనపు సెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపుతోపాటు అదనపు సెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సర్టిఫికెట్లతోపాటు దరఖాస్తు ఫీజు తనిఖీ రుసుంలను చెల్లించి గుర్తింపు కోసం దరఖాస్తు మార్చి 13 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలి.. ఆన్లైన్లోనే స్వీకరణ అపరాధ రుసుంతో ఏప్రిల్ 17 వరకు అవకాశం చేసుకోవాలని సూచించారు. తనిఖీ ఫీజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతుల కోసం జనరల్ కాలేజీలకు రూ. 65వేలు, 5 కాలేజీలకంటే అదనంగా ఒకే యాజమాన్యానికి ఉంటే వారు తనిఖీ ఫీజును రూ. 75వేలు చెల్లించాలి. అఫిలియేషన్ ఫీజుగా రూ.16వేలు చెల్లించాలి.. అదే 5 కాలేజీల కంటే అదనంగా రూ. 20వేలు చెల్లించాలి.

గ్రామ పంచాయతీల్లో తనిఖీ ఫీజు రూ.20వేలు

అదే మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు అయితే తనిఖీ ఫీజు రూ.50వేలు, 5 కాలేజీల కంటే ఎక్కువగా ఉంటే రూ.62,500, అఫిలియేషన్ ఫీజు రూ. 14వేలు, 5 కాలేజీల కంటే ఎక్కువగా ఉంటే రూ. 15వేలు. గ్రామ పంచాయతీల్లో తనిఖీ ఫీజు రూ.20వేలు, 5 కాలేజీల కంటే ఎక్కువగా ఉంటే రూ. 25వేలు, 5 కాలేజీల కంటే ఎక్కువగా ఉంటే రూ. 102 చెల్లించాలి. ఒకేషనల్ కాలేజీలక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తనిఖీ ఫీజు రూ.60,000 అఫి యేషన్ ఫీజు రూ. 5వేలు, మున్సి పాలిటీలు. నగరపంచాయతీల్లో రూ. 36వేలు తనిఖీ పీజు-అఫిలియేషన్కి రూ.5వేలు, గ్రామపంచాయతీల్లో అయితే తనిఖీ ఫీజు రూ. 16వేలు, అఫిలియేషన్ ఫీజు రూ. 5వేలుగా నిర్ణయించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ అది ఆదిత్య ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 145 వరకు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల కొనసాగుతున్నాయి. అవి కాకుండా ప్రభుత్వ. ప్రభుత్వరంగ సంస్థల కాలేజీలు మరో 120C నుంచి 1400 వరకు కొనసాగుతున్నాయి. వాటిన్నింటిలో కలిపి ఇంటర్మీడియట్ విద్యలొ సుమారు 10 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.