Toxic : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన భారీ చిత్రం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇందులో కేవలం భారతదేశం నుంచే రూ. 120 కోట్ల వరకు వసూళ్లు రావడం గమనార్హం. యశ్ మునుపటి చిత్రాల క్రేజ్, భారీ అంచనాల నడుమ విడుదల కావడం వల్ల ఓవర్సీస్ ప్రీమియర్లు, అడ్వాన్స్ ప్రీ-బుకింగ్స్ ద్వారానే ఈ స్థాయిలో వసూళ్లు నమోదైనట్లు ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : టాక్సిక్ ఫిలిం ను ‘బ్లూ ఫిల్మ్ ‘ తో పోలుస్తున్న ఆడియన్స్

టాక్‌తో బాక్సాఫీస్ వద్ద నెమ్మదించనున్న వేగం?
భారీ ఓపెనింగ్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టించినప్పటికీ, సినిమాకు మొదటి రోజు నుంచి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ లభించలేదు. మిశ్రమ స్పందనతో పాటు ఎక్కువ భాగం నెగటివ్ రివ్యూలు రావడంతో రెండో రోజు నుంచి కలెక్షన్లలో డ్రాప్ (తగ్గుదల) ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నిలబడుతుందో, లాభాల బాట పడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :