రేషన్ కార్డులకు ఈ మార్గదర్శకాలు తప్పనిసరి

Read Time:  1 min
Ration Card Holders
Ration Card Holders
FONT SIZE
GET APP

భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.. ఇవి ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉన్నాయి. దీనిలో భాగంగానే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్వహించబడే ఒక ప్రత్యేక పథకం ద్వారా ప్రజలకు తక్కువ ధరకు రేషన్ అందిస్తున్నారు. ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేయబడుతుంది. ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన ప్రజలకు సంబంధించి.. ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. కొంతమంది రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత.. ఈ మార్గదర్శకాలను పాటించని వారు రేషన్ పొందలేరు.

రేషన్ కార్డు హోల్డర్లు ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే.. E-KYC ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో విఫలమైనవారు ఈ పథకం కింద రేషన్ పొందలేరు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం నకిలీ రేషన్ కార్డు హోల్డర్లను గుర్తించడం. E-KYC ప్రాసెస్ ద్వారా ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డు హోల్డర్లను గుర్తిస్తుంది.

వీరిని పథకం నుండి తొలగించడం జరుగుతుంది. ఇది నిజమైన అర్హులైన వ్యక్తులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చూడడంలో సహాయపడుతుంది. E-KYC పూర్తి చేయాలంటే.. మీకు దగ్గర్లోని ఆహార సరఫరా కేంద్రంకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.