📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Collections: రూ.4 వేల కోట్ల రుణం సేకరించిన సర్కార్

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ క్వార్టర్లో రూ.17,400 కోట్లకు రుణం

హైదరాబాద్: సెక్యూరిటీ బాండ్ల(Security Bonds)ను వేలం వేయడం ద్వారా రాష్ట్ర సర్కార్(State Government) రూ.4 వేల కోట్ల రుణాన్ని సేకరించింది. ఈ మేరకు మంగళవారం రిజర్వ్ బ్యాంకు(Reserve Bank) నేతృత్వంలో బహిరంగ వేలం ద్వారా ఈ మొత్తాన్ని తీసుకుంది. ఇందుకు గాను నాలుగు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వీటిలో 33 ఏండ్ల కాలానికి వెయ్యి కోట్లు, 34 ఏండ్ల కాలానికి మరో వెయ్యి కోట్లు, 35 ఏండ్ల కాలానికి ఇంకో వెయ్యి కోట్లు, 36 ఏండ్ల కాల పరిమితితో మరోసారి వెయ్యి కోట్లకు సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ నుండి జూన్) రాష్ట్రం రుణాలు దాని ప్రారంభఅంచనాలను అధిగమిస్తున్నాయి.

Collections: రూ.4 వేల కోట్ల రుణం సేకరించిన సర్కార్

ఏప్రిల్, మే నెలలకు మార్కెట్ రుణాలు
ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.14 వేల కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు వాటి మొత్తం రూ.17,400 కోట్లకు చేరుతోంది. ఇది మొదట్లో రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన ఇండెంట్ కంటే రూ.3,400 కోట్లు ఎక్కువ. ఏప్రిల్, మే నెలలకు మార్కెట్ రుణాలు వరుసగా రూ.4 వేల కోట్లు, రూ.5 వేల కోట్లుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే, రైతు భరోసా పథకం మరియు ఇతర ఖర్చుల డిమాండ్లను తీర్చడానికి ఈ నెలలో ప్రభుత్వం అదనపు నిధులను సేకరించాల్సి వచ్చింది. ప్రస్తుత వనకాలంలో రైతు భరోసాతో పాటు, యాసంగి బకాయిలతో దాదాపు 9 వేల కోట్లు అవసరం ఉంటుందని అంచనా. ఈ నేపధ్యంలో ఇక రాబోయే రెండు వారాల్లో మరో రూ.2 వేలు, రూ.3 వేల కోట్లు రుణం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక రుణాలు అంచనా వేసిన దానికంటే కనీసం రూ.5,400 కోట్లకు పెరుగుతాయని వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ 2025 -26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాలు రూ.64,539 కోట్లుగా వార్షిక బడ్జెట్లో అంచనా వేయబడింది. అయితే, ప్రస్తుత సర్కార్ రుణాల వేగం ఇలాగే కొనసాగితే, గత ఆర్థిక సంవత్సరంలో చేసినట్లుగానే బడ్జెట్ అంచనాల పరిమితిని అధిగమించే వీలుందని అధికరవర్గాలు లెక్క వేస్తున్నాయి.

Read Also: KTR : నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్‌

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu has raised a loan of Latest News in Telugu Paper Telugu News Rs. 4 thousand crores. Telugu News online Telugu News Paper Telugu News Today The government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.