Telugu News: TGSRTC- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం

Read Time:  1 min
TGSRTC- ఛార్జీల సవరణ 'దసరా స్పెషల్స్'లోనే స్పష్టం
TGSRTC- ఛార్జీల సవరణ 'దసరా స్పెషల్స్'లోనే స్పష్టం
FONT SIZE
GET APP

దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలు(Ticket charges) పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)((RTC) యాజమాన్యం ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. పండుగల సమయంలో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు అదనపు వసూలు ఉంటుందని, ఇది 2003 నాటి ప్రభుత్వ జీవో నంబర్ 16 ప్రకారం కొనసాగుతున్న ఒక ఆనవాయితీ అని వివరించింది.

TGSRTC

జీవో నంబర్ 16, స్పెషల్ బస్సుల ఏర్పాటు

ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి వంటి సమయాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడుపుతుంది. ఈ బస్సులు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడానికి హైదరాబాద్(Hyderabad) సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతాయి. అయితే, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తుంటాయి. ఈ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులను భర్తీ చేయడానికి, టికెట్ ధరను సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు పెంచుకోవచ్చని 2003లో ప్రభుత్వం జీవో నంబర్ 16 జారీ చేసింది. ఇది అన్ని బస్సులకు కాదని, కేవలం స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

దసరా, బతుకమ్మకు ప్రణాళిక

ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ రద్దీకి అనుగుణంగా రోజూ 500 నుంచి 1,000 వరకు స్పెషల్ బస్సులను నడుపుతుంది. ఈ నెల 20వ తేదీ, అలాగే 27 నుండి 30వ తేదీ వరకు, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. మిగతా రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. పండుగల సమయంలో అన్ని బస్సుల్లోనూ చార్జీలు పెంచారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

బస్సు చార్జీలు పెరిగాయన్న వార్త నిజమేనా?

ఇది అవాస్తవం. సాధారణ బస్సు చార్జీలు పెరగలేదు. పండుగల సమయంలో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తారు.

స్పెషల్ బస్సుల్లో ఎంతవరకు చార్జీలు పెంచుతారు?

సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు పెంచుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/abhays-statement-on-ceasefire-is-personal/national/550743/

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.