📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Rains: తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన బలమైన సుడిగుండం, నైరుతి రుతుపవనాల బలపడటంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన బలమైన సుడిగుండం, నైరుతి రుతుపవనాల (Southwest monsoon) బలపడటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. సోమవారం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఓ మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన సుడిగుండం ప్రభావంతో నేటి నుంచి మంగళవారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (weather station) తెలిపింది. ముఖ్యంగా జూలై 7వ తేదీన వర్షపాతం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.వాతావరణ నివేదికల ప్రకారం, నేడు తెలంగాణలో రోజంతా మేఘావృతమై ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన బలమైన సుడిగుండం సాయంత్రానికి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని తాకుతుంది.

నేటి నుంచి

దీని ప్రభావంతో నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.

TG Rains: తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు

భారీ వర్షాలు

ప్రస్తుతం అరేబియా సముద్రంలో గంటకు 52 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా,తెలంగాణలో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలులకు తోడు నైరుతి రుతుపవనాల బలపడటంతో సోమవారం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జయశంకర్ జిల్లా (Jayashankar District) ల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయి.

అవసరమైతే

బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు (thunderbolts) పడే ఛాన్స్ ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ హెచ్చరికలను పాటించాలని కోరారు.వాహనదారులు ప్రయాణించే ముందు వాతావరణ సమాచారం తెలుసుకొని, జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com

Read Also: Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

#AsifabadWeather #Bhopalpally #ChhattisgarhCyclone #FloodAlert #HeavyRainAlert #IMDAlert #LightningAlert #Monsoon2025 #MuluguRains #NorthTelangana #RainWarning #TelanganaRains #TelanganaWeather #Thunderstorms #WeatherUpdate Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.