TG: కొత్త బడ్జెట్ పై 16 నుండి సన్నాహక చర్చలు

Read Time:  1 min
TG: కొత్త బడ్జెట్ పై 16 నుండి సన్నాహక చర్చలు
FONT SIZE
GET APP

వివిధ కారణాలతో సమీక్షల్లో జాప్యం

హైదరాబాద్ : వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక అంచనా బడ్జెట్ రూపకల్పనలో తెలంగాణ (TG) సర్కార్ నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుండి సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విభాగాల వారీగా వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షంచనున్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుండి తమకు కావాల్సిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్ధిక శాఖకు అందినా, వాటిపై సమీక్షలు నిర్వహించడంలో జాప్యం జరిగింది. గతనెల 24 నుంచి శాఖల వారీగా ఆర్థిక శాఖ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి విదేశీ పర్యటనలకు తోడు, సమక్క సారలమ్మ జాతర తదితర కారణాల వల్ల సమీక్షల్లో జాప్యం జరిగింది. దీనికి తగినట్లుగా ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.

Read Also:Temperature : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండలు..జాగ్రత్త

TG: కొత్త బడ్జెట్ పై 16 నుండి సన్నాహక చర్చలు
Preparatory talks on new budget from 16

ఆర్థిక శాఖకు చేరిన నిధుల ప్రతిపాదనలు

ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వస్తాయి. (TG) దీంతో ఈ ఫలితాల తర్వాత ఈనెల 16 నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలను నిర్వహించాలని ఆర్ధిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఏ రోజు సమావేశానికి రావాలనే అంశంపై అధికారులు కనరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో డిప్యూటీ సీఎం విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోని విషయాల గురించి చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది.

డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతిపాదనలపై కీలక సమీక్షలు

ప్రధానంగా ఆరు గ్యారంటీలు, పలు డిక్లరేషన్లు, ఇతర హామీలను అమలు చేయడంతో పాటు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలనే దానిపై వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్ర 2026-27 అంచనా బడ్జెట్కు సంబంధించి శాఖల వారీగా అవసరాలపై ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. గత నెల 23 నుంచి ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో శాఖల వారీగా ఆన్లైన్లో ఆయా శాఖలు బడ్జెట్ ప్రతిపాద నలను సమర్పించాయి. ముఖ్యంగా ఆదాయాలు, వ్యయాలు, వెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది సంఖ్య, వారి జీతాలు మరియు భత్యాలపై అయ్యే ఖర్చు వంటి అంశాలను కలుపుకొని అంచనాలను రూపొందించాయి. ఈ ప్రతిపాదనలను సంబంధిత విభాగాల ముఖ్య కార్యదర్శులు సమీక్షించి, వాస్తవ అవసరాలు తదితర అంశాలపై వ్యాఖ్యలతో ఆర్థిక శాఖకు సమర్పించారు. ఈ నేపధ్యంలో ఈ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.