TG Municipal Election: BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

Read Time:  1 min
TG Municipal Election: BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
FONT SIZE
GET APP

తెలంగాణలో(TG) త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై (TG Municipal Election) భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేశారు.ప్రధాన అంశాల్లో కోతులు, కుక్కల బెడద నివారణను చేర్చారు.

Read Also: TG: మేడారం హుండీలో భక్తుల వింత కోరికలు

TG Municipal Election: BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

మేనిఫెస్టో ప్రధాన హామీలు

పన్నుల పెంపు లేదు, వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, బస్తీ దవాఖానలు, స్మార్ట్ సిటీలుగా అభివృద్ది, క్లీన్ సిటీ, గ్రీన్ టౌన్. 100 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , దేవాలయాల రక్షణ, మహిళల రక్షణ. (TG Municipal Election) మున్సిపాలిటీల్లో దోమలు, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణ. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టో అంటూ రూపకల్పన తొలిసారి తెలంగాణలో అన్ని మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ మెజారీటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని పార్టీ పట్టుదలతో ఉంది. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కనీసం 5 కార్పొరేషన్లను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కష్టపడుతున్నారు. బీజేపీ యువ మోర్చాకు ఈ ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. జెన్-జీ టార్గెట్‌గా ప్రచారంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు..

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.