TG: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

Read Time:  1 min
TG: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
FONT SIZE
GET APP

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సినిమాకి టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ (TG) రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు స్పెషల్ జీవో జారీ చేసింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18 వరకూ సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు వెసులుబాటు కల్పించింది. జీఎస్టీతో కలుపుకొని ఈ ధరలు ఉండబోతున్నాయి. పది రోజుల పాటు ఈ స్పెషల్ రేట్లు అమల్లో ఉంటాయి.

Read also: Vijay: ‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

TG government has granted permission to increase the ticket prices for 'Rajasab'
TG government has granted permission to increase the ticket prices for ‘Rajasab’

హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యం

టికెట్ హైక్స్ ద్వారా వచ్చిన లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్‌ అకౌంట్ లోకి వెళ్తుందని ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.