📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Employees: తెలంగాణ ఉద్యోగులకు రెండు డిఏలు

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలౌవెన్స్ (డీఏ) లో ఒకదానిని వెంటనే విడుదల చేయాలని, మరో డీఏను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని తుదిస్థాయిలో తీర్మానం చేసింది.దీనితో పాటు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్య కార్యదర్శి (CS) అధ్యక్షతన ఓ హెల్త్‌కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు ,వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించింది.కొత్తగూడెం ఎర్త్‌ సైన్సెస్ యూనివర్సిటీ(Kothagudem Earth Sciences University)కి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని తీర్మానించింది.ఇది విద్యారంగానికి గౌరవంగా నిలవనుంది. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్ పరిశోధనలకు ప్రోత్సాహం లభించనుంది.

ప్రధాన మార్గాల్లో

కేబినెట్ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం గ్రామీణ మరియు పట్టణ రహదారుల అభివృద్ధి. రాష్ట్రంలోని మొత్తం 13,137 కిలోమీటర్ల మేర రహదారులను హ్యామ్ (Hybrid Annuity Model) విధానంలో రూ.33,000 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కలగనుండగా, లాజిస్టిక్ మౌలిక వసతుల అభివృద్ధి కూడా జరుగనుంది. దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా, పల్లెలు – పట్టణాల మధ్య సంబంధం మరింత బలపడనుంది.మెట్రో సేవల విస్తరణకు సంబంధించి మరో పెద్ద ప్రాజెక్టును కూడా కేబినెట్ ఆమోదించింది. మెట్రో రెండో దశ కింద రూ.19,579 కోట్ల వ్యయంతో మూడు ప్రధాన మార్గాల్లో కలిపి మొత్తం 86 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి మార్గంలోకి నడిపించనుంది. రద్దీని తగ్గించి, నగర ప్రజలకు వేగవంతమైన ప్రయాణ అవకాశాన్ని కల్పించనుంది.

నివేదికపై కేబినెట్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగిన ఐదున్నర గంటల సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులతో సంబంధమైన అనేక అంశాలపై చర్చ జరిగింది.ఉద్యోగులకు 2023 జనవరి 1 నుంచి పెండింగ్​లో ఉన్న ఐదు డీఏల్లో ఒకటి వెంటనే విడుదల చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. డీఏ(DA) బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించనున్నారు. మరో డీఏను ఆర్నెళ్లలో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెండింగ్‌ డీఏలు, బిల్లులు చెల్లించడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

TG Employees

అధికారులు వినియోగించే

ఉద్యోగుల 57 డిమాండ్లపై చర్చించిన మంత్రివర్గం, కొన్నింటిని ఆమోదించి, మరికొన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఉద్యోగుల పదోన్నతుల కోసం ప్రతీ సెప్టెంబరులో డీపీసీ(DPC) వేసేందుకు కేబినెట్ అంగీకరించింది. జీవో 317లో మరికొన్ని కేటగిరీలు చేర్చేందుకు కేబినెట్ అంగీకరించింది. అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ రహదారులను హ్యామ్ విధానంలో ఆధునికీకరించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13,137 కిలోమీటర్ల రోడ్ల ఆధునికీకరణకు రూ.33 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. హ్యామ్ విధానంలో రెండేళ్లలో నిర్మాణంతో పాటు 15 ఏళ్ల నిర్వహణ కూడా ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది. హైదరాబాద్‌ పరిధిలో మూడు కారిడార్లుగా 86 కిలోమీటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌తో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ నిధులు వచ్చేలా చొరవ తీసుకోవాలని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) కోరారు.
సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు బోనస్ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం (మహిళా సంఘాల సభ్యులు చనిపోతే రూ.10 లక్షలు) అమలుకు రూ.38.5 కోట్ల స్త్రీనిధికి కేటాయించాలని ఆమోదించింది. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.

Read Also: AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు

#CabinetUpdates #GovernmentDecisions #TelanganaCabinet #TelanganaGovernance Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.